»   »  త్రివిక్రమ్ ఐడియా బాగుంది: వర్కవుట్ అవుతుందా ?

త్రివిక్రమ్ ఐడియా బాగుంది: వర్కవుట్ అవుతుందా ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్ లో ఎప్పుడో స్టార్ట్ అయి, ఊపందుకున్న జానర్ మల్టిస్టారర్. తెలుగులో ఆ జానర్ అప్పుడప్పుడూ పలకరిస్తోంది. మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో సీతమవాకిట్లో సిరిమల్లె చెట్టు, వెంకటేష్, పవన్ కాంబినేషన్ లో గోపాల గోపాల ఇలా..అప్పుడప్పుడూ ఈ మల్టిస్టారర్ లు వస్తున్నాయి. అదే కోవలో ఇప్పుడు మరో మల్టి స్టారర్ ప్రారంభమవటానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

Is it Trivkram's Multi starrer with nagrjuna and bunny?


బిజినెస్, క్రేజ్ పరంగా మల్టీస్టారర్‌ చిత్రాల అవసరాన్ని టాలివుడ్ ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. ఇమేజ్‌ని పక్కన పెట్టి నటించడానికి హీరోలు సిద్ధంగానే ఉన్నారు. దాంతో ఉత్సాహంగా దర్శకులూ కథలు రెడీ చేసుకొంటున్నారు. తాజాగా మరో ఇద్దరు హీరోలు కలసి ఓ సినిమాలో నటించే అవకాశాలున్నాయని టాక్‌. ఆ హీరోలు మరెవరో కాదు అల్లు అర్జున్, నాగార్జున.

వీరి కాంబినేషన్ కోసం ప్రముఖ దర్శక,రచయిత త్రివిక్రమ్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ...అల్లుఅర్జున్‌ కోసం త్రివిక్రమ్‌ ఓ కథ రెడీ చేశారట. అందులో ఓ కీలకమైన పాత్ర ఉందట. దాన్ని మోహన్ లాల్ వంటివారితో చేయించాలని భావించారట. అయితే తెలుగు స్టార్ అయితే మరింత క్రేజ్ ఉంటుందని భావించి నాగార్జునను ఎప్రోచ్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Is it Trivkram's Multi starrer with nagrjuna and bunny?

ప్రస్తుతం ‘అఆ'తో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్‌. వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తరవాత సూర్యతో ఓ సినిమా చేయాల్సివుంది. మధ్యలో మూడు నెలలకు మించి విరామం వస్తే.. వెంటనే ఈ ప్రాజెక్టుని సెట్‌ చేయాలని భావిస్తున్నారని చెప్పుకుంటన్నారు. అల్లు అర్జున్ సైతం లింగు సామితో ఓ ప్రాజెక్టు అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు అనంతరం ఈ సినిమాని లాగేస్తారు.

English summary
Trivikram Srinivas is planning to do a family Multi starter with Nagarjuna & Bunny.They both liked the subject very much and asked Trivikram to develop the script accordingly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu