»   » పవన్ ఆ స్టెప్ వేస్తూంటే...నా సామిరంగా..విజిల్సే విజిల్స్

పవన్ ఆ స్టెప్ వేస్తూంటే...నా సామిరంగా..విజిల్సే విజిల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : మీకు గుర్తుందా...మెగాస్టార్ సూపర్ హిట్ 'ఇంద్ర' సినిమాలో సూపర్ హిట్ సాంగ్ 'దాయి దాయి దామ్మా...'లోని వీణ స్టెప్. ఆ తర్వాత సునీల్ వంటివారు ఈ వీణ స్టెప్ ని ఫన్నీగా వేయటానికి ప్రయత్నించారు కానీ సీరియస్ గా ఎడాప్ట్ చేసుకుని ఆ సాంగ్ కు ట్రిబ్యూట్ గా అందించలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం పవన్ ఆ పని చేయబోతున్నారు.

  పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ లో ఓ పాటలో ఈ స్టెప్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ ఐడియా చెప్పినప్పుడు... పవన్ ఎట్టి పరిస్ధితుల్లోనూ అలాంటివి చేయనని మెండికెత్తి కూర్చున్నాడట. అయితే పవన్ కు సన్నిహితులైన వాళ్లు పవన్ ని ఒప్పించారట. దాంతో ఇప్పుడు ఈ సినిమాలో ఈ ప్రత్యేకత చేరింది.


  Also Read: నో మూడ్, ఏకాదశి ఇంకా... : 'గబ్బర్ సింగ్'...కొన్ని సీక్రెట్స్


  మరి ఈ విషయం తెలిసిన వెంటనే దేవిశ్రీప్రసాద్...ఓ సాంగ్ ట్రాక్ లో ఆ స్టెప్ కు సంభందించిన ట్యూన్ ని కలపబోతున్నట్లు తెలుస్తోంది. చిరు స్టెప్స్ ని పవన్ వేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి... హాళ్లు విజిల్స్ తో మారు మ్రోగుతాయి...చప్పట్లుతో దద్దరిల్లుతాయి. ఫ్యాన్స్ ఆనందంతో చేసే అల్లరితో భాక్స్ లు బ్రద్దలవుతాయి ..కాదంటారా.


  పవన్‌ కల్యాణ్‌, కాజల్‌ జంటగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. రాయ్‌లక్ష్మీ ముఖ్యభూమిక పోషిస్తోంది. శరత్‌ మరార్‌, సునీల్‌ లుల్లా నిర్మాతలు. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌, రాయ్‌లక్ష్మీలపై స్పెషల్ సాంగ్ ఉంటుంది.


  Also Read: ఆ రోజులే వేరప్పా : పవర్ స్టార్ కాక ముందు పవన్ (రేర్ ఫొటోలు)


  కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో ఆ గీతాన్ని తెరకెక్కించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ పాట ‘కొండవీటి రాజా'లోని ‘నా కోక బాగుందా...'కి రీమిక్స్‌ అని తెలిసింది. చిరంజీవి సాంగ్ ..కొండవీటి రాజా సినిమాలోని ఈ పాట చూడండి  చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన ఆ గీతాన్ని దేవిశ్రీప్రసాద్‌ తనదైన శైలిలో రీమిక్స్‌ చేసినట్టు సమాచారం. ఆ పాట అభిమానుల్ని మరింతగా అలరించడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నాయి. ఆ పాటలోనే ఈ స్టెప్ వస్తుందని కూడా అంటున్నారు.


  స్లైడ్ షోలో ..పవన్ కళ్యాణ్ @ సర్దార్ సెట్స్


  తరుచుగా

  తరుచుగా

  పవన్‌ కల్యాణ్‌కు తరచుగా ఎదురయ్యే ప్రశ్న... మీ అన్నయ్య చిరంజీవి సినిమాల్ని రీమేక్‌ చేసే అవకాశం వస్తే చేస్తారా? అని.  ప్రయత్నం చేయలేదు

  ప్రయత్నం చేయలేదు

  అయితే పవన్‌ మాత్రం ఇప్పటిదాకా ఆ ప్రయత్నం చేయలేదు.  చేయనంటున్నారు

  చేయనంటున్నారు

  భవిష్యత్తులో కూడా అలాంటి ప్రయత్నాలు చేయనంటున్నారు.  కానీ ....

  కానీ ....

  అన్నయ్య పాటలో ఇటీవలే తమ్ముడు ఆడిపాడాడు. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' కోసం.  రెండు కోట్లు...

  రెండు కోట్లు...

  ఓ విలేజ్ సెట్ ని రెండు కోట్లు ఖర్చు పెట్టి మరీ వేసి షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  సేమ్..

  సేమ్..

  గబ్బర్ సింగ్ ఎక్కడ షూట్ చేసారో అదే లొకేషన్ లో ఈ సినిమాలో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు.  అనుకున్న తేదీకే

  అనుకున్న తేదీకే

  అలాగే సర్థార్ ను ఈ సమ్మర్ కు ప్రకటించిన తేదీకే తీసుకురావలని ప్రయత్నిస్తున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం.


  అందుకే

  అందుకే

  వేసవిలో అయితే శెలవలు కలిసి వస్తాయని టీమ్ భావిస్తోంది.  అదరకొడుతోంది

  అదరకొడుతోంది

  మరో ప్రక్క ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమయ్యి, అదరకొడుతోంది  బాహుబలి తర్వాత...

  బాహుబలి తర్వాత...

  ఎక్కువ రేటుకు నెల్లూరులో అమ్ముడైన చిత్రం ఇదే.  కండీషన్స్

  కండీషన్స్

  ఈ చిత్రం రైట్స్ కు ఉన్న డిమాండ్ తో నిర్మాతలు రకరకాల కండీషన్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది.  అయినా సరే...

  అయినా సరే...

  పవన్ సినిమాకు ఉన్న క్రేజే వేరు అని నాన్ రిఫెండబుల్ ఎడ్వాన్స్ తో ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు  నెల్లూరు రేటు

  నెల్లూరు రేటు

  నెల్లూరు కి చెందిన సూరి శెట్టి నరేంద్ర, లీలా మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నారు. రేటు ఎంత అంటారా.. రెండు కోట్ల డబ్బై రెండు లక్షలు.  తమిళంలో..

  తమిళంలో..

  మరో ప్రక్క నిర్మాతలు తమిళనాడులో సత్యం సినిమాస్ తో టై అప్ అయ్యి రిలీజ్ చేయనున్నారు.  ఓవర్ సీస్ ఫినిష్

  ఓవర్ సీస్ ఫినిష్

  ఇప్పటికే ఓవర్ సీస్ తో సహా చాలా ఏరియాలు అమ్ముడయ్యాయి.


  ఇదొక్కటే...

  ఇదొక్కటే...

  ఈ మధ్యకాలంలో ఇంత డిమాండ్ తో అమ్ముతున్న సినిమా ఇదే అంటున్నారు.


  దేవి స్వయంగా

  దేవి స్వయంగా

  ఈ చిత్రంలోని ఓ పాటని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, గాయని శ్రేయా ఘోషల్‌లు కలిసి పాడుతున్నారు.


  రీరికార్డింగ్ అదుర్స్

  రీరికార్డింగ్ అదుర్స్

  రికార్డింగ్‌ బాగా జరిగిందని, శ్రేయా చక్కగా పాడారని తెలిపారు. పాట వినడానికి మీరంతా ఎదురుచూస్తున్నారా? అంటూ అభిమానుల్ని దేవి సరదాగా ప్రశ్నించారు.  ఇది క్లాజ్..

  ఇది క్లాజ్..

  అయితే డిస్ట్రిబ్యూటర్స్ కు చేసే ఎగ్రిమెంట్ లో ‘నో రిఫెండ్' అనే క్లాజ్ పెట్టారని వినికిడి . ఈ క్లాజ్ అర్దం ఏమిటీ అంటే సినిమా కు లాస్ లు ఏదన్నా వస్తే... వెనక్కి నిర్మాతలు రూపాయి కూడా డిస్ట్రిబ్యూటర్స్ కు పే చెయ్యరన్నమాట.


  ధియోటర్ రైట్స్ విషయానికి వస్తే..

  ధియోటర్ రైట్స్ విషయానికి వస్తే..

  వరల్డ్ వైడ్ రైట్స్ ని ఎరోస్ వారు తీసుకొని, అప్పుడే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఏరియాల బిజినెస్ ని కూడా క్లోజ్ చేసినట్లు సమాచారం.  ట్రేడ్ టాక్

  ట్రేడ్ టాక్

  10.7 కోట్లకి సర్దార్ గబ్బర్ సింగ్ సీడెడ్ రైట్స్ అమ్ముడు పోయాయి.  అలాగే..

  అలాగే..

  వైజాగ్ రైట్స్ ని 7.2 కోట్లకి కొనుక్కున్నారు.  వీటిని

  వీటిని

  ఓవర్ సీస్, నైజాం రైట్స్ ని ఎరోస్ వారే తమ దగ్గర ఉంచుకున్నారు.


  కొత్త కథ...

  కొత్త కథ...

  నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా 'గబ్బర్‌సింగ్‌'కు సీక్వెలో ప్రీక్వెలో కాదు. ఇదో కొత్త కథ ''అన్నారు.  స్క్రీన్ ప్లే విషయంలో..

  స్క్రీన్ ప్లే విషయంలో..

  పవన్‌ చిత్ర కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు.  ప్రధాన ఆకర్షణ

  ప్రధాన ఆకర్షణ

  సినిమాలోని భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా సీన్స్ రూపొందించారు, ఫన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి  ఏప్రియల్ 8న

  ఏప్రియల్ 8న

  ఈ సినిమా ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.  స్పెషల్ సీన్స్

  స్పెషల్ సీన్స్

  బాహుబలి చిత్రంలో కనిపించే జలపాతాల వద్ద ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.


  సంజన కూడా

  సంజన కూడా

  పవన్ సరసన కాజల్, రాయ్ లక్ష్మీ ఆడిపాడుతున్నారు. అలాగే కన్నడ భామ సంజన కూడా ఈ మధ్యనే ఈ లిస్ట్ లో చేరింది.  హోప్స్..

  హోప్స్..

  పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.  అందుకే..

  అందుకే..

  బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్ సినిమాలు సమ్మర్ కు రిలీజే అయ్యి సూపర్ హిట్ సినిమాలుగా మారడంతో ఇప్పుడు పవన్ వాటి దారిలోనే నడవాలనుకుంటున్నాడు.   శెలవలు లేవు

  శెలవలు లేవు

  సండేస్ తప్ప ఎవరికీ శెలవు ఇవ్వకుండా...కాన్సర్టేషన్ గా వర్క్ చేస్తునున్నారు.


  బిజీగా..

  బిజీగా..

  ఈ చిత్రం షూటింగ్‌లో పవన్‌ బిజీగా గడుపుతున్నారు.


  పోలీస్ గా..

  పోలీస్ గా..

  ఈ చిత్రంలోనూ పవన్ పోలీస్ గా అదరకొట్టనున్నారు.  ఫిట్

  ఫిట్

  పోలీస్ పాత్రలో ఫిట్ గా ఉండేందుకు సరపడ పవన్ జిమ్ కు వెళ్లి మరీ రెడీ అయ్యారు.


  పవర్ ఫుల్ గా..

  పవర్ ఫుల్ గా..

  నెగిటవ్ పాత్రలను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.


  అదిరే డైలాగులు

  అదిరే డైలాగులు

  దర్శకుడు బాబి..తనదైన శైలిలో అదిరే పంచ్ లతో డైలాగులు రాసాడంటున్నారు


  స్టార్ డైరక్టర్

  స్టార్ డైరక్టర్

  దర్శకుడు బాబి ఈ చిత్రం ఆఫర్ తో స్టార్ డైరక్టర్ గా మారిపోయారు


  సూపర్ రెస్పాన్స్..

  సూపర్ రెస్పాన్స్..

  ఇప్పటికే విడుదల చేసిన 'సర్దార్‌' ఫస్ట్‌లుక్‌ కు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందీ.  ప్రభంజనం

  ప్రభంజనం

  పవన్‌ కల్యాణ్‌ ఖాకీ కడితే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో 'గబ్బర్‌ సింగ్‌'లో చూశాం. ఇప్పుడూ అలాంటి ప్రభంజనం వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.  అదరకొడతారు

  అదరకొడతారు

  'నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ డైలాగులనే బులెట్లులా పేల్చారు అందులో. ఇప్పుడు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ అవతారంలోనూ అదరకొడతారు. మరోసారి లాఠీ పట్టి హంగామా చేయబోతున్నాడు.


  మిత్రుడే నిర్మాత

  మిత్రుడే నిర్మాత


  ఈ చిత్రాన్ని పవన్ మిత్రుడు శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


  రీమిక్స్ తో

  రీమిక్స్ తో

  చిరంజీవి సాంగ్ ని రీమిక్స్ చేయటం ద్వారా చిరంజీవి తో ఆయనకున్న అనుబంధ మరింత బలపడినట్లు ఉంటుందని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.  గుర్రాళ మేళా

  గుర్రాళ మేళా

  'హార్స్‌ మేళా' పేరుతో గుర్రాలపై షూటింగ్‌ చేసారు. ఆ ఎపిసోడ్ హైలెట్ అంటున్నారు.  ఈ మేళాలో....

  ఈ మేళాలో....

  వంద గుర్రాలు, వంద మంది అశ్వికులు, 40 మంది చిత్రానికి సంబంధించిన ప్రధాన తారగణం, అలాగే వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొనగా మూడు యూనిట్స్‌తో 'హార్స్‌మేళా' సన్నివేశాలను అత్యంత భారీగా చిత్రీకరిస్తున్నాం.  పురాతన కార్లు కూడా..

  పురాతన కార్లు కూడా..

  ఈ మేళా సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. గుర్రాలే కాకుండా కొన్ని పురాతన కార్లతోపాటు అధునాతన కార్లను కూడా చిత్రీకరణలో వాడుతున్నాం.  టెక్నికల్ స్టాడర్డ్స్

  టెక్నికల్ స్టాడర్డ్స్

  సాంకేతిక విలువలకు పెద్ద పీట వేస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే బరోడా, రాజ్‌కోట, కేరళ, మల్‌షేట్స్‌ ఘాట్స్‌, మహారాష్ట్ర తదితర ప్రదేశాల్లో జరిగింది.  లాస్ట్ స్టేజ్

  లాస్ట్ స్టేజ్

  దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.  రెడీ టు..

  రెడీ టు..

  మార్చిలో ఆడియోను విడుదల చేసి, ఏప్రిల్‌ 8న సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.  టెక్నికల్ డిటేల్స్

  టెక్నికల్ డిటేల్స్

  కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి దేవీశ్రీ స్వరాలు సమకూరుస్తున్నాడు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌


  English summary
  Pawan Kalyan was reluctant about the prospect of imitating his brother's veena step when the idea was proposed. He felt stepping into Chiranjeevi's shoes wouldn't be easy . But after some deliberation he gave the green signal,“ shares a source from the film's set.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more