»   » ఐస్ క్రీమ్ నాక్కొనే హీరోయిన్ తో ప్రిన్స్ మహేష్ బాబునా....

ఐస్ క్రీమ్ నాక్కొనే హీరోయిన్ తో ప్రిన్స్ మహేష్ బాబునా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మగధీర మిత్రవింద' కాజల్ అగర్వాల్‌ కు ఐసులన్నా ఐస్‌ క్రీమ్‌ లన్నా నోరూరుతుందట. ఎక్కడైనా ఐస్‌ క్రీమ్ పార్లల్ కనబడితే చటుక్కున ఆగిపోయి తనకిష్టమైన ఐస్‌ క్రీమ్‌ ను లాగించేసి వెళుతుందట. అంతేకాదండోయ్..పొద్దస్తమానం ఐస్‌ క్రీమ్‌ లను కొనాల్సి వస్తోందని ఐస్‌ క్రీమ్ ఎలా చేయాలో నేర్చేసుకుందట. ఏదీ.. కొన్ని ఐస్‌ క్రీమ్‌ల పేర్లు చెప్పమని అడిగితే, బనానా ఐస్ క్రీమ్, బ్లాక్ జామ్ ఐస్‌ క్రీమ్, చాక్లెట్ ఐస్‌ క్రీమ్, కోకోనట్ ఐస్‌ క్రీమ్, ఫ్రూట్ ఐస్‌ క్రీమ్, హాట్ చాక్లెట్ ఐస్‌ క్రీమ్, కేసర్ ఇలాచి ఐస్‌ క్రీమ్, మ్యాంగో ఐస్‌ క్రీమ్, పైనాపిల్ ఐస్‌ క్రీమ్, స్ట్రాబెర్రీ ఐస్‌ క్రీమ్, వెనిలా ఐస్‌ క్రీమ్.. ఇంకా చాంతాడంత లిస్టు ఉన్నదని చెప్పింది.

ఇంట్లో తీరిక దొరికినపుడల్లా వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని ఐస్‌ క్రీమ్ తయారు చేసుకుని జుర్రుకుంటుందట. అన్నట్లు చిన్నపిల్లల్లా ఐస్‌ క్రీమ్ కరిగిపోయి చేతుల నుండి కారిపోతూ ఉంటే దానిని నాకుతూ రుచి చూడటం అంటే కాజల్‌ కు భలే ఇష్టమట. అలా తింటేనే క్రీమ్‌ లో ఉన్న రుచి మజా తెలుస్తుందని అంటోందట.

అంతే కాదండోయో మరో విశేషమేంటంటే హీరో మహేష్ బాబు కొత్తగా వస్తున్న హీరోయిన్ల పై కన్నెస్లున్నట్టున్నాడు. నాగ చైతన్యతో నటించిన సమంతను తన 'దూకుడు" సినిమాలో పెట్టుకున్న మహేష్ ఒక్క అందగత్తె సరిపోదన్నట్టు మరో హీరోయిన్ ను తన పక్కన చేర్చుకున్నాడు. మగధీర, బృందావనం, హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను తన వద్దకు లాక్కున్నాడు వీరిద్దరు శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చె సినిమాలో నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu