»   » మహేష్ బాబుని ఆ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తొలగించినట్టు...!?

మహేష్ బాబుని ఆ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తొలగించినట్టు...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిరత్నంతో సినిమా అంటే ఎంతటి హీరోలైనా అన్నీ వదిలేసుకుంటారు. అలాంటి విషయమే హీరో మహేష్ బాబుకి కూడా జరిగిపోయింది. మణిరత్నం మొదలు పెట్టబోయే ఓ భారీ చారిత్రాత్మక చిత్రంలో విక్రమ్, మహేష్ హీరోలంటూ మీడియాలో చాలా వార్తలే వచ్చాయి. వీటన్నింటినీ నిజం చేస్తూ 'పోన్నియన్ సెల్వం" అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని మణితర్నం కూడా ఒప్పేసుకుని స్ర్కిప్ట్ రెడీ చేయించేసాడు.

దాదాపుగా అన్ని కుదర్చుకొన్న ఈ ప్రాజెక్ట్ నుండి మహేష్ బాబుని తొలగించి ఇప్పుడు సూర్యని తీసుకున్నట్టు తమిళ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. విక్రమ్ మరియు సూర్య ఇంతకు ముందే బాల డైరెక్షన్ లో పితామగన్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇదే నిజం అయితే తెలుగు తమిళుల మధ్య చిత్ర పరిశ్రమలో జరుగుతున్న యుద్దానికి ఆజ్యం పోసినట్లే. మహేష్ బాబుకి తమిళంలో క్రేజ్ లేదనా? లేక అక్కడి సూర్యకి తెలుగులో మార్కెట్ ఉందనా?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu