యంగ్ హీరోయిన్‌తో నాగచైతన్య డేటింగ్.. సమంతతో డైవర్స్ తర్వాత మళ్లీ లవ్‌లో..!
సమంత రుత్ ప్రభుతో విడాకుల తర్వాత నాగచైతన్య మళ్లీ ప్రేమలో పడ్డారా? అంటే జాతీయ మీడియాకు చెందిన వెబ్‌సైట్లు, ఫిలిం నగర్ వర్గాలు అవునంటున్నాయి. ప్రస్తుతం నాగార్జున, యువ హీరోయిన్ డేటింగ్ వ్యవహారం మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. కేవలం తెలుగు మీడియాలోనే కాకుండా బాలీవుడ్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది. ఈ వార్తలోకి వెళితే..

2021లో సమంత, చైతూ విడాకులు
నాగచైతన్య, సమంత ఇద్దరు ప్రేమించి 2017లో వివాహం చేసుకోవడం తెలిసిందే. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో 2021 అక్టోబర్ 2వ తేదీన విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో ఇద్దరి అభిమానులు, సినీ వర్గాలు షాక్ తిన్నాయి. అప్పటి నుంచి ఇద్దరు సింగిల్‌గానే ఉంటూ వస్తున్నారు. సమంత, చైతూ తమ కెరీర్‌పై దృష్టిపెట్టారు.

శోభితా ధూళిపాలతో డేటింగ్
అయితే తాజాగా గూఢచారి, మేజర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన శోభితా ధూళిపాలతో నాగ చైతన్య ప్రేమలో పడ్డారనే విషయం గురించి మీడియా కోడైకూస్తున్నది. కొద్ది వారాలుగా వారిద్దరూ డేటింగ్ చేస్తూ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నట్టు మీడియా వర్గాలు తమ కథనాల్లో పేర్కోన్నారు. అయితే వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా, పింక్ విల్లా తమ కథనంలో వెల్లడించారు.

జూబ్లి హిల్స్‌లోని ఇంటి వద్ద
సమంత రుత్ ప్రభుతో విడాకుల తర్వాత నాగార్జున హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లోని తన కొత్త ఇంటిలోకి మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా మరమ్మత్తులు జరుగుతున్న ఇంటిలో తమ కారును పార్క్ చేసుకొని ఇద్దరు కొంత సమయం గడిపారు. ఆ సమయంలో నాగచైతన్య, శోభితా ఇద్దరు ఆ ఇంటిలో కలిసి సన్నిహితంగా ఉన్నారు. దాంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అంటూ ఆంగ్ల మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

మేజర్ ప్రమోషన్స్ సందర్భంగా శోభితతో
అంతేకాకుండా మేజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శోభిత ఓ హోటల్‌లో ఉండగా..ఆమెను నాగ చైతన్య కలిశారు. వాళ్లిద్దరూ చాలాసార్లు ఇటీవల కలిసి తిరగడం కనిపించింది. అయితే వారిద్దరి కలిసి తిరగడంతో రిలేషన్ షిప్ జోరుగా సాగుతుందనే రూమర్లు మీడియాలో కనిపించాయి. అితే వారిద్దరి మధ్య లవ్ స్టోరి నడుస్తున్నాదా? రిలేషన్‌షిప్ ఉందా అనేది వారు అధికారికంగా స్పందిస్తే తప్పా.. ఇలాంటి వార్తలకు అడ్డుపడే అవకాశం లేదు అని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సమంత, నాగచైతన్య కెరీర్ ఇలా..
సమంత, నాగచైతన్య కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల సమంత KRK చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన యశోదా, శాకుంతలం సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇక నాగచైతన్య సొగ్గాడే చిన్నినాయనా చిత్రం సీక్వెల్ బంగర్రాజుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలోనే థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందేకు ప్రయత్నిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











