Pooja Hegde మహేష్ మూవీకి బుట్ట బొమ్మ షరతులు.. త్రివిక్రమ్‌కు పెట్టిన కండీషన్స్ ఏమిటంటే?
బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్‌లో హిట్లు, ఫెయిల్యూర్‌కు సంబంధం లేకుండా గ్రాఫ్ దూసుకెళ్తున్నది. ఈ అందాల భామకు భారీ ప్రాజెక్టులు, అగ్ర నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది నిర్మాతలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోతున్నారనే వార్త మీడియాలోను, సినీ వర్గాల ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు షరతులు భారీగానే పెట్టినట్టు సమాచారం. అయితే పూజా హెగ్డే కెరీర్, త్రివిక్రమ్, నిర్మాతకు పెట్టిన షరతు ఏమిటంటే?
Recommended Video


వరుస ఫ్లాప్స్‌తో బుట్టబొమ్మ
గతంతో పోల్చుకొంటే పూజా హెగ్డేకు 2022 సంవత్సరం చేదు అనుభవాన్ని మిగిల్చింది.అరవింద సమేత, అల వైకుంఠపురం సినిమా విజయంతో జోష్‌లో ఉన్న పూజా హెగ్డేకు ఈ ఏడాది వరుసగా మూడు ఫ్లాపులు ఎదురయ్యాయి. ఆమె నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

క్రేజీ ఆఫర్లతో పూజా హెగ్డే
అయితే వరుసగా మూడు డిజాస్టర్లు ఖాతాలో వేసుకొన్న పూజాహెగ్డేకు ఆఫర్లు దండిగానే వస్తున్నాయి. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న జన గణ మన సినిమాలో రికార్డు స్థాయి రెమ్యునరేషన్ తీసుకొన్నట్టు మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇంకా పలు చిత్రాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది.

త్రివిక్రమ్ మూవీకి భారీ రెమ్యునరేషన్
ప్రస్తుతం అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ ప్రాజెక్టుతో వస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నది. మహేష్ బాబు కెరీర్‌లో 28వ చిత్రంగా రూపొందుతున్న సినిమాలో నటించడానికి సుమారు 2 కోట్ల రూపాయలు తీసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఆ విషయంలో కండీషన్ పెట్టిన పూజా హెగ్డే
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా హారికా, హాసిని బ్యానర్‌లో నిర్మాత ఎస్ రాధాకృష్ణ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం 45 రోజులు కాల్షిట్స్‌ను పూజా హెగ్డే కేటాయించారు. అయితే ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టుల కారణంగా తాను ఇచ్చిన డేట్స్ కంటే ఒక్క రోజు కూడా ఎక్కువగా పాల్గొనలేనని పూజా హెగ్డే చెప్పినట్టు సమాచారం. తాను ఇచ్చిన డేట్స్, కాల్షిట్స్ లోబడి తన పార్టును పూర్తి చేయాలని నిర్మాతను కోరినట్టు తెలిసింది.

పూజా హెగ్గే కెరీర్ ఇలా..
ఇక పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల రిలీజైన F3 చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్ అనే చిత్రంలో నటిస్తున్నది. అలాగే సల్మాన్ ఖాన్‌తో కబీ ఈద్ కభీ దీవాళీ చిత్రంలో కూడా నటిస్తున్నది. అలాగే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జన గణ మన చిత్రంలో హీరోయిన్‌గా మెరువనున్నారు.


Click it and Unblock the Notifications











