»   » రజనీకాంత్ 'రోబో' ఆ హాలీవుడ్ చిత్రం నుంచి !?

రజనీకాంత్ 'రోబో' ఆ హాలీవుడ్ చిత్రం నుంచి !?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రోబో పై రోజుకో కథనం వినపడుతోంది. తాజాగా ఈ చిత్రం Bicentennial Man (1999) అనే చిత్రం ఆధారంగా రూపొందిందని చెప్పుకుంటున్నారు. రాబిన్ విలియమ్స్ ఈ చిత్రంలో రోబో గా నటిస్తారు. ఆయన వేసిన రోబో గెటప్...రజనీకాంత్ చేసిన రోబో గెటప్ ని యధాతదంగా పోలి ఉండటంతో ఈ రకమైన వార్తలు పుడుతున్నాయి. అయితే శంకర్ ఈ చిత్రం నుంచి ఇన్ఫరై రోబో కథను, గెటప్ ని తయారు చేసుకుని ఉండవచ్చుకానీ, కథను మాత్రం తీసుకుని ఉండరని అంటున్నారు. ఇక ఈ చిత్రం కథ అంటూ ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది.

రజనీకాంత్‌ సైంటిస్టుగా, 'రోబో"గా ద్విపాత్రాభినయం చేస్తున్న కధ మొత్తం 2200 AD లో జరుగుతుంది. అప్పుడు రజనీకాంత్ ఓ ఫేమస్ సైంటిస్టు. ఐశ్వర్యారాయ్ తో పిచ్చి ప్రేమలో ఉంటాడు.బెస్ట్ సైంటిస్ట్ అవార్డ్ పొందిన అతనికి ప్రభుత్వం ఓ ముఖ్యమైన పని అప్పచెబుతుంది. మానవ జీవితాన్నీ సౌకర్యవంతం చేయటానికి అవసరమైన రొబొలను తయారు చేయమని ఆదేశిస్తుంది. అయితే అసలు సమస్యంతా రజనీ..రొబో తయారు చేయటంతో వస్తుంది. అక్కడ నుండి కథ కొన్ని ఆసక్తి కరమైన మలుపులు తిరుగుతుంది.

ఇక కథలో ముఖ్యమైన మలుపు విలన్ పాత్రతో వస్తుంది.సైంటిస్ట్ రజనీ పేరు ప్రఖ్యాతలు చూసి ఓర్వలేక విలన్ ఆ తయారైన రొబొకి కొన్ని ముఖ్యమైన ప్రేమకు సంభందించిన పాస్ వర్డ్ మార్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. దాంతో ఆ రొబో తను తయారు అయిన కారణం వదిలేసి హీరోయిన్ తో ప్రేమలో పడుతుంది. అక్కడనుండి అది ఐశ్వర్య వెనుక పడుతూ సమస్యలు క్రియేట్ చేస్తుంది. చివరకు రజనీ తిరిగి ఎలా ఆ రొబో ను కంట్రోల్ లోకి తెచ్చుకుని తన ప్రేయసి ని కాపాడుకున్నాడు అనేది మిగతా కథ.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu