300 కోట్ల బడ్జెట్‌తో రాంచరణ్ పాన్ ఇండియా మూవీ.. దర్శకుడు ఎవరంటే?

ఉప్పెన చిత్రంతో భారీ విజయాన్ని అందుకొన్న బుచ్చి బాబు సనా తన రెండో చిత్రం కోసం ఏడాదికిపైగానే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో ఓ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయాలని ప్లాన్ చేశాడు. ఆ సినిమాకు ఎన్టీఆర్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ RRR సినిమాతో బిజీగా ఉండటంతో ఎదురు చూశాడనే కథనాలు కూడా మీడియాలో కనిపించాయి.

అయితే చివరకు ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ వర్కవుట్ కాకపోవడంతో మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ ఒకే చెప్పడంతో బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్, రూమర్లు అభిమానులకు మరింత కిక్కునిచ్చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

Is Ram Charan and Buchi Babu Sana movie to made with 300 crores?

ప్రస్తుతం రాంచరణ్ తన కెరీర్‌లో 15వ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమా తర్వాత రాంచరణ్, బుచ్చిబాబు సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం కనిపిస్తున్నది.

రాంచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఇంకా పేరుపెట్టని సినిమాకు వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. కబాడ్డీ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కి ఈ చిత్రాన్ని జనవరిలో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించేందుకు వెంకట సతీష్ కిలారు రెడీ అవుతున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X