For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సైరా’లో రామ్ చరణ్.. షేర్ ఖాన్ పాత్రలో మెరిసిన మెగా పవర్ స్టార్.. చివర్లో షాకిచ్చారు

  |
  Ram Charan To Play Important Role In Syeraa Narasimha Reddy ? || Filmibeat Telugu

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా: నరసింహారెడ్డి' ఒకటి. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్య్ర సమరమోధుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన 'సైరా' మేకింగ్ వీడియో, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేశాయి. దీనికి తోడు ఈ సినిమా హిందీతో ఐదు భాషల్లో విడుదల అవుతోంది. దీంతో చిరంజీవి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయారు. ఇలాంటి తరుణంలో ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇది ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేస్తుంది.

   ప్రమోషన్ షురూ చేసేశారు

  ప్రమోషన్ షురూ చేసేశారు

  సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే ‘సైరా' మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ 14న విడుదల చేసింది. దీనికి భారీ స్పందన వచ్చింది. అలాగే, ‘సైరా' సినిమా టీజర్‌ను ఆగస్టు 20న వదిలారు. దీనికి కూడా విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత ముంబైలో ప్రెస్‌మీట్ కూడా నిర్వహించారు. దీనికి బడా స్టార్లు హాజరైన విషయం తెలిసిందే.

  పవన్‌ను తీసుకొచ్చారు

  పవన్‌ను తీసుకొచ్చారు

  ఈ సినిమా టీజర్‌కు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇక, ఇటీవల పవన్ వాయిస్ ఓవర్‌కు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో పవన్ కల్యాణ్ డబ్బింగ్ థియేటర్‌కు రావడం నుంచి చూపించారు. అలాగే, ‘సైరా నరసింహారెడ్డి' అంటూ గంభీరమైన స్వరంతో ఆయన చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. అది చూసిన అన్నయ్య చిరంజీవి.. వెంటనే పవన్‌ను హత్తుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

   రామ్ చరణ్‌కు ఒక పాత్ర

  రామ్ చరణ్‌కు ఒక పాత్ర

  ఇక, తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో షేర్ ఖాన్ అనే పాత్ర ఒకటి ఉంటుందట. ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ పాత్ర సినిమాకు ముఖ్యమైనదని తెలుస్తోంది. దీని కోసం మొదట రామ్ చరణ్‌తో నటింపజేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి భావించాడని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని ఫొటో షూట్లు కూడా చేశాడట. ఆ తర్వాత కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారని సమాచారం.

   ఎవరు కారణమో కానీ షాకిచ్చారు

  ఎవరు కారణమో కానీ షాకిచ్చారు

  ‘సైరా: నరసింహారెడ్డి'లో రామ్ చరణ్ ఉన్న విషయాన్ని సీక్రెట్‌గా ఉంచి, చిరంజీవి పుట్టినరోజు రివీల్ చేయాలని భావించారట. అయితే, ఎందుకో, ఎవరు కారణమో తెలియదు కానీ.. ఈ సీన్స్ తీసేశారని తెలుస్తోంది. గతంలో వీళ్లిద్దరూ మూడు సినిమాల్లో జంటగా కనిపించారు. ఇండస్ట్రీ హిట్ ‘మగధీర', ‘బ్రూస్‌లీ'లో చిరు అతిథి పాత్రలో నటించారు. ఇక, చిరు కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150'లో రామ్ చరణ్ ఒక పాటలో స్టెప్పులేసిన విషయం తెలిసిందే.

  ఆ సినిమాలో మాత్రం కలిసే చేస్తారట

  ఆ సినిమాలో మాత్రం కలిసే చేస్తారట

  ‘సైరా: నరసింహారెడ్డి' షూటింగ్ జరుగుతుండగానే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇది కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ స్క్రిప్టును చిరు విన్నారు. దీనికి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించబోతున్నాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

  ‘సైరా: నరసింహారెడ్డి' గురించి..

  ‘సైరా: నరసింహారెడ్డి' గురించి..

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార, తమన్నా నటిస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

  English summary
  Sye Raa Narasimha Reddy, a Megastar Chiranjeevi starrer, is one of the most awaited films of this year, has finally got a buyer in Bollywood. It is said that actor Farhan Akhtar has bought the Hindi dubbing rights of the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X