వర్మ బలిపశువుగా మారాడా? కావాలనే శ్రీరెడ్డి వివాదంలోకి?.. ఎవరికోసం చేశాడంటే..

By Rajababu

వివాదాస్పద నటి శ్రీరెడ్డి వ్యవహారం ప్రస్తుతం దర్శకుడు రాంగోపాల్ వర్మ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నది. జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్‌పై, ఆయన తల్లిపై శ్రీరెడ్డి నీచమైన కామెంట్లు చేయడం అత్యంత వివాదాస్పదమైంది. ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌కు శ్రీరెడ్డి క్షమాపణలు కోరారు. తనతో కొందరు వ్యక్తులు తిట్టించారని శ్రీరెడ్డి చెప్పడం ఈ వివాదం మరో మలుపు తిరిగింది. శ్రీరెడ్డి పేరు వెల్లడించకపోయినా దర్శకుడు రాంగోపాల్ వర్మ తానే శ్రీరెడ్డితో తిట్టించేలా చేశానని చెప్పడంతో మెగా ఫ్యామిలీ హీరోలతోపాటు సినీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Recommended Video

Sri Reddy Sensational Comments On Tollywood Star Heroes
వర్మకు సంబంధం లేదు

వర్మకు సంబంధం లేదు

పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి దూషణల వివాదంపై మీడియాలో అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీరెడ్డిని తిట్టించింది వర్మ కాదని చెప్పుకొంటున్నారు. వర్మకు ఈ వివాదానికి సంబంధం లేదు అని వెల్లడిస్తున్నారు.

కావాలనే ఈ వివాదంలోకి

కావాలనే ఈ వివాదంలోకి

ఎప్పుడూ వివాదాల్లో తలదూర్చే అలవాటు ఉన్న రాంగోపాల్ వర్మ తానంతట తానే ఈ వివాదంలోకి వచ్చినట్టు సమాచారం. శ్రీరెడ్డి చేత నాటకం ఆడిస్తున్న వ్యక్తులు బయటకు రాకుండా చేసేందుకు వర్మ రంగంలోకి వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే ఆ వ్యక్తులు ఎవరనే విషయంపై మీడియాలో చర్చ జరుగుతున్నది.

పవన్ సెన్సేషనల్ ట్వీట్

ఇదిలా ఉండగా, నా తల్లిని దూషించే డ్రీమ్ ట్రీంలో మరో సభ్యుడు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఉన్నారు. అతడుు నా తల్లిని తిట్టిన వీడియో ఫుటేజ్‌ను టీఆర్పీల కోసం వాడుకొన్నారు అని పవన్ ట్వీట్ చేశారు.

పవన్ ట్వీట్ల వర్షం

మా తల్లిని తిట్టించే కార్యక్రమంలో మరో ముగ్గురు కూడా ఉన్నారు అని శ్రీనిరాజు, టీవీ9 రవిప్రకాశ్, దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఫోటోలను పెట్టి మరో ట్వీట్ చేశారు.

పవన్‌పై కుట్రల వెనుక ఎవరు?

పవన్‌పై కుట్రల వెనుక ఎవరు?

అయితే శ్రీరెడ్డిని వాడుకోవడం వెనుక కుట్ర ఏమిటి? ఏం ఆశించి వారు ఈ కుట్రకు పాల్పడ్డారు? ఎవరి కోసం రాంగోపాల్ వర్మ వివాదంలోకి దూరారు? మీడియా అధినేతల పేర్లను పవన్ కల్యాణ్ ఎందుకు బహిరంగం చేశారు అనే అంశాలు ప్రశ్నలుగానే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X