120 దేశాల్లో.. 20 భాషల్లో SSMB29 మూవీ.. రాజమౌళి భారీ స్కెచ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భారీ హంగులతో షూటింగ్ జరుపుకొంటున్నది. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్నాయి. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు దేవా కట్టా కథ, మాటలు అందిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఇండియాలో పలు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకొని విదేశాల్లో అడుగుపెట్టింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను కెన్యా రాజధాని నైరోబి ప్రాంతంలో ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కెన్యా టూరిజం మంత్రిని, ఇతర ప్రభుత్వ అధికారులును కలిసి చర్చలు జరిపిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ షూటింగ్ కొనసాగుతుండగానే మరో వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది.

Mahesh Babu s SSMB29

అయితే పాన్ ఇండియా సినిమాగా మొదలైన ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమాగా మార్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసేందుకు హాలీవుడ్‌లోని ప్రముఖ డిస్టిబ్యూషన్ సంస్థ వార్నర్ బ్రదర్స్‌తో చర్చలు జరుపుతున్నారనే విషయం అభిమానుల్లో క్రేజీగా మారింది. అయితే ప్రపంచ సినిమా రంగంలోనే అత్యధిక దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

ఇటీవల కాలంలో హాలీవుడ్‌లో సంచలనం రేపిన అవతార్ 2, అవెంజర్స్ ఎండ్‌గేమ్ చిత్రాలు అత్యధిక దేశాల్లో రిలీజైన చిత్రంగా ఘనతను సాధించాయి. ఆంథోని రూసో, జోయ్ రూసో దర్శకత్వం వహించిన అవెంజర్స్ చిత్రం 85 దేశాలకుపైగా విడుదల కాగా, జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన నిర్మించిన అవతార్ 2 సినిమా 70 దేశాలకుపైగా రిలీజైంది. అయితే ఈ రెండు సినిమాలను మించి SSMB29 సినిమాను అత్యధికంగా విదేశాల్లో రిలీజ్ చేయాలని జక్కన్న భారీ ప్లాన్ రచిస్తున్నట్టు సమాచారం.

Mahesh Babu s SSMB29

అయితే మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇంకా పేరు పెట్టని చిత్రం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఎవరూ టచ్ చేయని విధంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేయడానికి ప్రణాళిక సిద్దమైంది. ఈ సినిమాను సుమారుగా 120 దేశాలకుపైగా, 20 భాషల్లో రిలీజ్ చేయాలని నిర్మాత నారాయణ వ్యూహాలను రచిస్తున్నారు. ఇది వర్కవుట్ అయితే.. కంప్లీట్‌గా ఈ సినిమా గ్లోబల్ మూవీగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇండియన్ సినిమాకు మహేష్ బాబు ఫేస్ ఆఫ్ మూవీగా మారడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Read more about: ss rajamouli mahesh babu ssmb29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X