Trisha Krishnan : ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కుతోన్న త్రిష? హీరోయిన్‌కు కాబోయే భర్త ఎవరంటే?

సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. రెండు నుంచి మూడేళ్లు .. మంచి హిట్స్ పడితే ఓ ఐదేళ్లు. అలాంటిది దాదాపు 25 ఏళ్లుగా హీరోయిన్‌గా అది కూడా స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు త్రిష కృష్ణన్. ఎప్పుడో 1999లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. నేటికీ ఫుల్ బిజీగా ఉంటున్నారు. త్రిషతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన వారంతా ఎప్పుడో ఫేడ్ అవుట్ కాగా.. ఆమె మాత్రం 42 ఏళ్ల వయసులోనూ చెక్క చెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. తాజాగా త్రిష పెళ్లిపై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

26 ఏళ్లుగా టాప్ ప్లేస్‌లోనే
1983 మే 4న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు త్రిష. తొలుత మోడలింగ్ వైపు అడుగులు వేసిన ఆమె.. మిస్ సేలం, మిస్ చెన్నై పోటీలలో పాల్గొని గెలుపొందారు. 2001లో మిస్ ఇండియాలో బ్యూటీఫుల్ స్మైల్ అవార్డును అందుకున్నారు. తర్వాత సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించిన త్రిష ఈ క్రమంలో ప్రశాంత్ - సిమ్రన్ జంటగా నటించిన జోడీ అనే సినిమాతో 1999లో చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేశారు. నీ మనసు నాకు తెలుసు మూవీతో తెలుగు వారిని పలకరించిన త్రిష.. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పూర్ణమి, స్టాలిన్, సైనికుడు, కృష్ణ, కింగ్, తీన్మార్, దమ్ము తదితర చిత్రాలతో టాలీవుడ్‌లోనూ సత్తా చాటుకున్నారు.

Is Trisha Krishnan tying the knot Groom Details Here

సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌన్స్ బ్యాక్
పాతికేళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో అందరు అగ్రహీరోల సరసన నటించారు త్రిష. అవకాశాలు తగ్గుతున్న దశలో చేసుకుని జీవితంలో స్ధిరపడాలని భావించిన ఈ ముద్దుగుమ్మ.. ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. అయితే అనివార్య కారణాలతో ఈ పెళ్లి రద్దయ్యింది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందిని తట్టుకుని నిలబడ్డ త్రిష తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో కలకలం రేపారు. పొన్నియన్ సెల్వన్ సిరీస్‌, ది రోడ్, లియో, గోట్, ఐడెంటిటి, విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ సినిమాలో నటించారు త్రిష. ప్రస్తుతం విశ్వంభర, సూర్య 45, రామ్ వంటి చిత్రాలలో నటిస్తున్నారు.

విజయ్‌ దళపతితో త్రిష ప్రేమాయణం?
అయితే కోలీవుడ్ అగ్రనటుడు, దళపతి విజయ్‌తో త్రిష కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. కీర్తి సురేష్ పెళ్లికి సీక్రెట్‌లో వీరిద్దరూ వెళ్లిరావడం, విజయ్‌తో ఎక్కువ క్లోజ్‌గా ఉండటంతో తదితర అంశాలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. విజయ్ త్వరలోనే తన భార్యకు విడాకులు ఇస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఈ స్థాయిలో పుకార్లు వస్తున్నా వీటిపై విజయ్ కానీ, త్రిష కానీ స్పందించకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Take a Poll

ఆ కుర్రాడితో పెళ్లికి త్రిష గ్రీన్ సిగ్నల్?
ఇదిలాఉండగా.. త్రిష కృష్ణన్ ఎట్టకేలకు పెళ్లికి అంగీకరించారని త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. తల్లిదండ్రులు చూసిన సంబంధానికి త్రిష ఓకే చెప్పారని కథనాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా కథనాలను బట్టి.. త్రిషకు కాబోయే భర్త పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన వ్యక్తని.. అతను ఆస్ట్రేలియాలో స్థిరపడి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. అలాగే తన వ్యాపారాన్ని భారత్‌లోనూ స్టార్ట్ చేశాడని అంటున్నారు. త్రిష కుటుంబంతో అతని ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉండటంతో వీరిద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. త్రిష ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X