»   » త్రివిక్రమ్ శ్రీనివాస్ ని తీవ్రంగా నిరాశపరిచిన సంఘటన

త్రివిక్రమ్ శ్రీనివాస్ ని తీవ్రంగా నిరాశపరిచిన సంఘటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ టాప్ డైరక్టర్స్ లిస్ట్ తీస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్పనిసరిగా ముందువరసలోనే ఉంటాడు. అయితే తాజాగా అప్పలరాజు చిత్రం కోసం తెలుగు దర్శకులపై రామ్ గోపాల్ వర్మ..ఎవడబ్బ సొమ్ము కాదురా టాలెంట్ అనే పాట రాయించారు. అందులో శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, పూరీ జగన్నాధ్, రాజమౌళి, వివి వినాయిక్ లని కూర్చాడు. కానీ త్రివిక్రమ్ పేరుని కలపలేదు. దాంతో తెలుగులో స్టార్ డైరక్టర్స్ వీళ్ళే అని ప్రత్యేకంగా చెప్పినట్లయింది. దాంతో త్రివిక్రమ్ ఈ పాట గురించి సునీల్ ద్వారా తెలుసుకుని ఎంతో ఎక్సపెక్ట్ చేసి వెయిట్ చేస్తున్నాట్ట. కానీ ఆ పాటలో త్రివిక్రమ్ పై చిన్న చెణుకు కూడా లేదు. ఈ విషయమై త్రివిక్రమ్ తన సన్నిహితులతో మాట్లాడుతూ..రామూ అందరి గురించి చెప్పాడు..నా గురించి తప్ప. నేను పెద్దగా సినిమాలు చేయకపోవటమే కారణమై ఉంటుంది అన్నారని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న ఖలేజా చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఈ చిత్రంతో పాటు త్రివిక్రమ్...పవన్ కళ్యాణ్ హీరో గా చేస్తున్న లవ్ ఆజ్ కల్ చిత్రం తెలుగు రీమేక్ వెర్షన్ కి డైలాగులు రాస్తున్నారు. వీటి తర్వాత త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభం కానుంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu