'నా పేరు సూర్య'పై షాకింగ్ రూమర్!: రాజశేఖర్ సినిమాతో లింకు?.. ఏంటిదంతా..

Recommended Video

'నా పేరు సూర్య'పై షాకింగ్ రూమర్ !

సినిమాపై బజ్ క్రియేట్ అవడం వేరు.. ఈ సినిమాతో పక్కా రికార్డులు బద్దలు అనిపించుకోవడం వేరు. 'నా పేరు సూర్య' టీజర్‌తో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు అల్లు అర్జున్.

రికార్డుల సంగతేమో కానీ.. ఈ సినిమాతో టాలీవుడ్‌కు సరికొత్త కథను, హీరో క్యారెక్టరేషన్‌ను పరిచయం చేస్తున్నట్లు ఫస్ట్ ఇంపాక్ట్ ద్వారా అర్థమవుతోంది. అయితే ఇలాంటి కథతో.. ఇదే తరహా పాత్రతో గతంలోనూ ఓ సినిమా రావడం గమనార్హం. ఇంతకీ దీనికి.. దానికి ఏంటా పోలిక..

 రాజశేఖర్ 'ఆగ్రహం'..:

రాజశేఖర్ 'ఆగ్రహం'..:

ఓ 20ఏళ్లు వెనక్కి వెళ్తే.. అప్పట్లో రాజశేఖర్ హీరోగా నటించిన 'ఆగ్రహం' సినిమా వచ్చింది. ఆ సినిమాలో రాజశేఖర్ పాత్ర సరిగ్గా ఇప్పుడు వచ్చిన 'నా పేరు సూర్య'లో అల్లు అర్జున్ పాత్ర తరహాలో ఉంటుంది. యాంగ్రీ ఆర్మీ మ్యాన్ గా.. నిండా దేశభక్తి కలిగి ఉన్న వ్యక్తిగా రాజశేఖర్ ఆ సినిమాలో కనిపించారు.

ఆ పాత్రతో పోలిక..:

ఆ పాత్రతో పోలిక..:

అల్లు అర్జున్ ఇప్పుడు పోషిస్తున్న పాత్రకు, ఆ పాత్రకు దగ్గరి పోలికలు ఉన్నట్లు కనిపిస్తున్నాయంటున్నారు. ఆ సినిమాలో సైన్యం నుంచి సెలవులపై ఇంటికి వచ్చే రాజశేఖర్.. బాధ్యతరాహిత్యంగా తిరిగే జనాలను చూసి ఆగ్రహంతో రగిలిపోతుంటాడు. తప్పు చేసేవాళ్లను ఏమాత్రం సహించడు. ఆఖరికి హీరోయిన్ సోదరుడిని కూడా కొట్టి ఇబ్బందులు కొని తెచ్చుకుంటాడు.

అవే ఛాయలు..:

అవే ఛాయలు..:

మొత్తానికి ఆ కోపం తనకు బలమో.. బలహీనతో తెలియని క్యారెక్టరైజేషన్ తో రాజశేఖర్ పాత్ర సాగుతుంది. 'నా పేరు సూర్య'లో అల్లు అర్జున్ పాత్ర చూస్తుంటే ఆ సినిమా ఛాయలు గుర్తొస్తున్నాయంటున్నారు. అయితే స్క్రీన్ ప్లే పరంగా ఆ సినిమాకు, ఈ సినిమాకు అసలు పోలిక ఉండకపోవచ్చని కూడా చెప్పవచ్చు.

'ఆగ్రహం' స్ఫూర్తిగా?:

'ఆగ్రహం' స్ఫూర్తిగా?:

కథా పరంగా.. క్యారెక్టరైజేషన్ పరంగా రెండింటికి పోలిక ఉండటంతో దర్శకుడు వక్కంతం వంశీ ఆ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఉంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కథ సంగతేమో గానీ క్యారెక్టరైజేషన్ మాత్రం స్ఫూర్తి అనుకోవడానికి లేదేమో!. గతేడాది వచ్చిన అర్జున్ రెడ్డి క్యారెక్టరైజేషన్ కూడా యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టరే. కథా నేపథ్యాన్ని బట్టి ఆ కోపం తాలుకు షేడ్స్ మారుతుంటాయి. కాబట్టి 'నా పేరు సూర్య'లోనూ అల్లు అర్జున్ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారేమో చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X