హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో విజయ్.. భార్యకు విడాకులు? హిట్టు సినిమాకు మించి సంగీతతో ప్రేమకథ!

వారిసు సినిమా రిలీజ్ తర్వాత విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నాడనే వార్త మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సెపరేట్ అయిన వాళ్లిద్దరూ త్వరలోనే విడిపోతారు. వారి విడాకులకు కారణం టాప్ హీరోయిన్ అంటూ వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

 విజయ్ ఒంటరిగా రావడంతో

విజయ్ ఒంటరిగా రావడంతో


ఇళయ దళపతి విజయ్ సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్‌కైనా భార్య సంగీతతో హాజరవుతుంటారు. వారిసు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు విజయ్ ఒంటరిగా రావడంతో భార్యతో విభేదాలు కరెక్టే అంటూ వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అట్లీ భార్య శ్రీమంతానికి కూడా సింగిల్‌గా రావడంతో భార్యతో విడిపోతున్నారనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.

అభిమానితో విజయ్ ప్రేమకథ

అభిమానితో విజయ్ ప్రేమకథ


ఇక భార్య సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. సంగీతతో విజయ్ ప్రేమ కథ చాలా ఎమోషనల్‌గా మొదలైంది. లండన్‌కు చెందిన సంగీత హీరో విజయ్‌కి వీరాభిమాని. విజయ్ కెరీర్ జోరుగా సాగుతున్న అంటే 1996లో విజయ్‌ని కలిసేందుకు చెన్నైకి వచ్చింది. అయితే పలు ప్రయత్నాల తర్వాత ఓ షూటింగులో విజయ్‌ను కలిసి తన అభిమానాన్ని ఆయన ముందు ఉంచింది.

అభిమానం పెళ్లిగా మారడంతో

అభిమానం పెళ్లిగా మారడంతో


సంగీత అభిమానానికి ముచ్చటపడిన విజయ్‌.. ఆమెను కలుసుకోవడానికి ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అభిమానం భార్యగా మార్చేసింది. దాంతో 1999 సంవత్సరంలో ఆగస్టు 25న వారి వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్దతుల్లో జరిగింది.

22 సంవత్సరాల దాంపత్య జీవితం

22 సంవత్సరాల దాంపత్య జీవితం


గత 22 సంవత్సరాల దాంపత్య జీవితం సజావుగా సాగింది. 2000 సంవత్సరంలో కుమారుడు జాసన్ సంజయ, 2005లో కూతురు జన్మించింది. తమిళనాడులో విజయ్ ఎదురులేని హీరోగా మారాడు. సూపర్ స్టార్ హోదాతో కలెక్షన్లను కుమ్మేస్తున్నాడు. హిట్టు, ఫట్టు అనే తేడా లేకుండా వందల కోట్లు వసూలు చేస్తున్నాడు.

 స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో అంటూ

స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో అంటూ


అయితే ఇటీవల కాలంలో ప్రముఖ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో పడ్డారనే రూమర్ వైరల్ అవుతున్నది. సోషల్ మీడియాలో విజయ్, హీరోయిన్ ఫోటోలను పోస్టు చేసి కామెంట్లు పెడుతున్నారు. హీరోయిన్ ప్రేమకు విజయ్ దాసోహంగా మారాడు. ఆ కారణంగానే సంగీత, విజయ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే వాదన తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియడానికి వేచి చూడాల్సిందే.

ఫ్యాన్స్ గట్టిగా ఖండన

ఫ్యాన్స్ గట్టిగా ఖండన

అయితే భార్య సంగీతతో విడిపోతున్నారనే వార్తలపై విజయ్ మౌనం వహించడం అనేక సందేహాలకు దారి తీస్తున్నది. అయితే విజయ్‌ను కొందరు రాజకీయ నేతలు టార్గెట్ చేసి మానసికంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు ఊపందుకోవడంతో కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశంతో చేస్తున్నారని ఫ్యాన్స్ గట్టిగా బదులిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X