For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Getup Srinu: హాట్ టాపిక్ గా గెటప్ శ్రీను రెమ్యునరేషన్.. చిరంజీవి సినిమాకు అంత తీసుకున్నాడా?

  |

  మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ మూవీ రీమేక్ గా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఆచార్య మూవీ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ లో బ్రహ్మగా అదరగొట్టారు చిరంజీవి. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు రాగానే సినిమాపై అంచనాలు అమాంత పెరిగాయి.

  అందుకు అనుగుణంగానే గాడ్‌ఫాదర్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఇందులో జబర్దస్త్ కమెడియన్ గా చాలా పాపులర్ అయిన గెటప్ శ్రీను రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

  రెట్టించిన ఉత్సాహంతో..

  రెట్టించిన ఉత్సాహంతో..

  ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అలా సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిన ఆయన.. ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకున్నారు.

  మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి 'గాడ్ ఫాదర్' మూవీ. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు 21 ఏళ్ల క్రితం హనుమాన్ జంక్షన్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజాను ఈ సినిమాకు డైరెక్టర్‌గా తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

  సల్మాన్ ఖాన్ నటించడంతో..

  సల్మాన్ ఖాన్ నటించడంతో..

  కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన 'గాడ్ ఫాదర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇందులో బడా స్టార్లను భాగం చేశారు. ముఖ్యంగా ఈ మూవీలో చిరంజీవికి సోదరి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించడం. అలాగే, హీరోను కాపాడే మాఫియా డాన్ రోల్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించడంతో ఆ అంచనాలు పెరిగిపోయాయి.

  ఇన్ని అంచనాల మధ్య విజయదశమి దసరా కానుకగా అక్టోబర్ 5న చాలా గ్రాండ్ గా విడుదలైంది చిరంజీవి గాడ్ ఫాదర్. సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సూపర్ అనే మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.

   బుల్లితెర కమల్ హాసన్..

  బుల్లితెర కమల్ హాసన్..

  భారీ తారాగణం నటించిన చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో జబర్దస్త్ కమెడియన్, బుల్లితెర కమల్ హాసన్ అని ముద్దుగా పిలుచుకునే గెటప్ శ్రీను యాక్ట్ చేశాడు. శ్రీనుకి చిరంజీవి తన సినిమాలో నటించే అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో గెటప్ శ్రీను తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

  ఈ సినిమాలో గెటప్ శ్రీను నటించడానికి సుమారు రూ. 10 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గాడ్ ఫాదర్ సినిమా బాగా హిట్ అవుతుందని, మెగా అభిమానులు చొక్కాలు చింపుకోడానికి రెడీగా ఉండండని మాట్లాడాడు. అంతేకాకుడా ఈ వేడుకలో చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు గెటప్ శ్రీను.

  ప్రేక్షకుడిగా చిరంజీవి సినిమాలు చూసేవాడిని..

  ప్రేక్షకుడిగా చిరంజీవి సినిమాలు చూసేవాడిని..

  ''నేను ఒక ప్రేక్షకుడిగా చిరంజీవి సినిమాలు చూసేవాడిని. అన్నయ్యకు నేను పెద్ద అభిమానిని. మెగాస్టార్ ని స్ఫూర్తిగా తీసుకోని నేను ఇండస్ట్రీకి వచ్చాను. నాలాంటి వాళ్లు ఎంతోమంది ఇండస్ట్రీకి రావడానికి కారణం చిరింజీవిని ప్రేరణగా తీసుకోవడమే. అంతేకాకుండా ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని వస్తున్న వారికి చిరంజీవి ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తున్నారు'' అని గెటప్ శ్రీను తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నాకు చిరంజీవి పక్కన నటించే అవకాశం రావడం నిజంగా పెద్ద అచీవ్ మెంట్ అంటూ ఎమోషనల్ అయ్యాడు గెటప్ శ్రీను.

  English summary
  Jabardasth Comedian Getup Srinu Remuneration For Megastar Chiranjeevi Starrer Godfather Movie Is Rs 10 Lakh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X