»   » నిజమే అయితే ఇలియానా పంట పండినట్లే

నిజమే అయితే ఇలియానా పంట పండినట్లే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ ‌: హాట్ ఇలియానా...టాలీవుడ్, కోలివుడ్ లను వదిలి ఆ మద్యన బాలీవుడ్ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె హాలీవుడ్ కు కూడా ప్రయాణం కట్టబోతోందని వినికిడి. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె జాకీఛాన్ సరసన...కుంగుఫూ యోగ చిత్రంలో నటించనుందని తెలుస్తోంది. గతంలో ది మిత్ చిత్రంలో మల్లికా షరావత్ ని తీసుకున్నట్లుగానే ఇప్పుడు ఆమెను తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ వార్త నిజమే అయితే ఇలియానా పంట పండినట్లే అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే సోనూ సూద్ ని ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రకు తీసుకున్నారు.

illi1

'బొమ్మాళీ.. నిన్నొదలా..'అంటూ 'అరుంధతి'లో పశుపతి పలికిన మాటలు మర్చిపోలేం. ఆ పాత్రను అద్భుతంగా పోషించిన నటుడు సోనూ సూద్‌. ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనూ తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ జోరుగానే ఉన్నాడు. ఇటీవలే 'హ్యాపీ న్యూ ఇయర్‌'తో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా ఓ గొప్ప అవకాశం సోనూకు దక్కింది. త్వరలో జాకీచాన్‌తో కలిసి వెండితెరపై కనిపించబోతున్నాడు. ఈ విషయం విన్న పూరి జగన్నాథ్ ...శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్ చేసారు.

జాకీచాన్‌ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కుంగ్‌ ఫు యోగ'. స్టాన్లీ టంగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాకీచాన్‌తో పాటు కలిసి నటించే కీలక పాత్రలో నటించనున్నాడు సోనూ. 'కుంగ్‌ ఫు యోగ' పూర్తి స్థాయి యాక్షన్‌ చిత్రం. జాకీచాన్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

jaki1

ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. తర్వాత బీజింగ్‌తో పాటు ఇండియాలోనూ చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సోనూకు ఇంత మంచి అవకాశం రావడం పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

త్వరలో 'కుంగ్‌ ఫూ యోగా' చిత్రంలో నటించనున్నారు జాకీచాన్‌. ఆ సినిమా చిత్రీకరణ కోసం ఇండియాకు రాబోతున్నట్లు జాకీచాన్‌ తెలిపారు. 'కుంగ్‌ ఫూ యోగా' చిత్రం తొలి ఇండియా-చైనా కో ప్రొడక్షన్ చిత్రం అవుతుంది. గత సెప్టెంబర్ లో ఈ చిత్రం సైన్ చేసారు. గతంలో జాకీచాన్..బాలీవుడ్ నటి మల్లికాషెరావత్ తో కలిసి ది మిత్ చిత్రం చేసారు.

English summary
As per reports, Ileana has been roped to play female lead opposite Jackie Chan in his upcoming flick 'Kung Fu Yoga'. A major part of 'Kung Fu Yoga' will be shot in India. Hence, Jackie Chan preferred casting Indian actors in his movie. Sonu Sood plays the parallel lead with Jackie in this project.
Please Wait while comments are loading...