»   » అవి జగపతిబాబుని వెంటాడి వేధిస్తున్నాయి

అవి జగపతిబాబుని వెంటాడి వేధిస్తున్నాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'లెజెండ్‌'లో జగపతిబాబు జితేంద్రగా అలరించి, పూర్తి బిజీ ఉన్న నటుడుగా మారుతున్నారు. తన బ్యాడ్ పిరియడ్ అయ్యిపోయిందని భావిస్తున్న సమయంలో ఆయన్ని గత చిత్రాలు వెంబడిస్తున్నాయి. 'లెజెండ్‌' కు ముందు ఆయన చేసిన చిత్రాలు విడుదలకు సిద్దమయ్యి...కంగారుపెడుతున్నాయి. అప్పట్లో అవి రొటీషన్ కోసం జగపతిబాబు చేసిన చిత్రాలు..అవి ఇప్పుడు తను కాస్త ఫామ్ లోకి రాగానే రిలీజ్ అయ్యి ఆయన తనకు ఇబ్బంది పెడుతాయని భావిస్తున్నారు.

ఆ వరసలోనే ఎప్పుడో పూర్తైన ఆయన చిత్రం 'ఏప్రిల్‌ ఫూల్‌' సైతం రిలీజ్ అవుతోందని ఇండస్ట్రీ టాక్. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం గ్రౌండ్ హగ్ డే అనే ఆంగ్ల చిత్రం కాపీగా రూపొందిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దాని సంగతి ఎలా ఉన్నా బిజినెస్ కాక రిలీజ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు జగపతిబాబుకి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని మే 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె.ఎస్‌.ఐ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జి.ఎల్‌.శ్రీనివాస్‌ నిర్మాత.

Jagapathi Babu's 'April Fool' to release on May 10th

నిర్మాత మాట్లాడుతూ ''కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది. వినోదంతో పాటు.. ప్రేక్షకుల వూహకు అందని మలుపులు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. బంటి అందించిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరాయి''అన్నారు. ఛాయాగ్రహణం: తనికెళ్ల రాజేంద్రప్రసాద్‌.

జగపతి బాబు మాట్లాడుతూ... ఇప్పటికే హీరోగా నా కెరీర్‌ అయిపోయింది. నా మార్కెట్‌ పడిపోయింది. నటుడిగా నాకు విలువ ఉందన్న సంగతి నాకు తెలుసు. అందుకే ముందడుగు వేశా. నిజానికి ఇది మామూలు కమర్షియల్‌ సినిమాల్లో కనిపించే ప్రతినాయకుడి పాత్ర కాదు. నా పాత్రపై ప్రేక్షకుల్లో అంతో ఇంతో సానుభూతి కలుగుతుంది. అది ఒకవిధంగా ప్లస్‌ అయ్యింది. నా గెటప్‌ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకొన్నా. ఇటాలియన్‌ లుక్‌లో కనిపించా. ఆ కాస్ట్యూమ్స్‌ నాకు నేనుగా డిజైన్‌ చేసుకొన్నా అన్నారు.

అయితే ఇవన్నీ ప్రక్కన పెడితే...జగపతిబాబు ఎప్పుడైతే.. అన్నిరకాల పాత్రలకూ తలుపులు తెరిచారో, దర్శకుల తలపులు కూడా మారాయి. జగపతి కోసం కొత్త పాత్రలు పుడుతున్నాయి. 'రా రా కృష్ణయ్య', 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇవికాక మరో మూడు చిత్రాలు అంగీకరించారు.

English summary

 Jagapathi Babu and Bhoomika have paired up for the movie,'April Fool'. K.S.I is the director and G.L.Srinivas is the producer. The movie has completed it's shooting part and is in post production now. The producer has fixed the release date as May 10th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu