»   » జగపతి బాబు మరీ అంత దిగిజారిపోయాడా?

జగపతి బాబు మరీ అంత దిగిజారిపోయాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలకు పెద్ద హీరోగా మారిన జగపతిబాబు..యాక్షన్ సినిమాల మోజులో పడి డౌన్ అయిపోయాడు. ఇప్పుడు దాదాపు రిటైర్మెంట్ స్టేజిలో ఉన్న జగపతి రెమ్యునేషన్ కేవలం రోజుకు నాలుగు లక్షలు మాత్రమే. కావాల్సిన వారు బేరం కూడా ఆడుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఆయనతో సినిమా ప్లాన్ చేసుకుంటున్న వారు కూడా పది, పదిహేను రోజుల మించి డేట్స్ తీసుకోవటం లేదు. అంటే సినిమాకు నలభై నుంచి బేరం ఆడితే పాతిక లక్షల వరకూ ముడుతోంది. ముఖ్యంగా నట్టికుమార్ ..జగపతిబాబు డేట్స్ ని కంటిన్యూగా తీసుకుని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఏమిటి ఇంతలా జగపతిబాబు రెమ్యునేషన్ తగ్గిపోయింది అంటే వరస ఫ్లాపులే కారణం అంటున్నారు. అంతేగాక శాటిలైట్ రైట్స్ కూడా పలకటం లేదని చెప్తున్నారు. ఇక జగపతిబాబు కూడా ఎవరు వెళ్లి అడిగినా వెంటనే కాల్షీట్స్ ఇస్తున్నారు. కథ,డైరక్టర్ ,నిర్మాత వంటి పట్టింపులు ఏమీ పెట్టుకోవటం లేదు. ప్రస్తుతం జగపతిబాబు చట్టం నీ అబ్బ సొత్తా, కీ చిత్రాలు చేస్తున్నారు.

English summary
Jagapathi Babu's new film 'Key' is one such thriller launching newsreader Swapna of Sakshi and Deepthi Vajpayee of TV9. Although 'Key' is an experimental film shot with minimum budget and good concept, trailers of film are sleek with these two babes attracting the eyeballs of viewers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu