»   » జియో బాహుబలి.. ట్రైలర్ రికార్డు వెనుక అంబానీ!

జియో బాహుబలి.. ట్రైలర్ రికార్డు వెనుక అంబానీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ది కన్‌క్లూజన్ ట్రైలర్ సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో ప్రపంచ సినిమా చరిత్ర రికార్డులను బద్దలు కొడుతున్నది. రెండురోజుల్లోనే ఈ ట్రైలర్‌ను దాదాపు 6.5 కోట్ల మంది వీక్షించారు. ఇంకా ఈ ట్రైలర్‌ వ్యూస్ కౌంట్ ఇంకా పెరుగుతున్నది.

 జియో పరోక్ష సహకారం

జియో పరోక్ష సహకారం

బాహుబలి ట్రైలర్ రికార్డు విజయానికి జియో మొబైల్ నెట్‌వర్క్ కూడా పరోక్షంగా సహకరించిందనే మాటలు వినిపిసున్నాయి. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులందరికీ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అందిస్తున్న ఫ్రీ డేటా ఆఫర్ వల్లనే బాహుబలి2 ట్రైలర్‌ను దేశవ్యాప్తంగా ఎక్కువమంది వీక్షించడానికి వీలుకలిగిందనే వాదన బలంగా వినిపిస్తున్నది.

జియో గడువు 31తో పూర్తి

జియో గడువు 31తో పూర్తి

గత మూడు నెలలకుపైగా జియో ఉచితంగా సిమ్స్ సప్లై చేసి ఫ్రీ డాటా ఇచ్చింది. దీంతో ఇటీవల తెలుగు చిత్రాల ట్రైలర్లకు, పాటలకు బాగా రికార్డు వ్యూస్ వచ్చాయనేది స్పష్టమైన విషయం. విడుదలైన మొదటిరోజే బాహుబలి ట్రైలర్‌కు మొబైల్ యూజర్లు బ్రహ్మరధం పట్టడానికి కారణం జియోనే అంటున్నారు. జియో కల్పించిన ఫ్రీ డేటా సదుపాయం మార్చి 31తో ముగియనున్నది. ఆ తర్వాత జియో వినియోగదారులు సొంతంగా రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల నుంచే..

తెలుగు రాష్ట్రాల నుంచే..

జియో ఆఫర్ నేపథ్యంలో జనవరి నుంచి తెలుగు చిత్రాల ట్రైలర్లు, ఆడియోలకు యూట్యూబ్‌లో మంచి స్పందన కనిపిస్తున్నది. ఇటీవల విడుదలైన ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్రశాతకర్ణి తదితర చిత్రాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే ఎక్కువగా హిట్స్ వచ్చాయని నిపుణులు పేర్కొంటున్నారు.

 ఇతర చిత్రాలపై పెరుగుతున్న ఒత్తిడి

ఇతర చిత్రాలపై పెరుగుతున్న ఒత్తిడి

జియో ఆఫర్ ముగియనున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీకి ముందే తెలుగు చిత్రాల ఆడియో, ట్రైలర్ల ఆవిష్కరించాలనే ప్రణాళికతో నిర్మాతలు ముందుకెళ్తున్నారట. మహేశ్‌బాబు, మురుగదాస్ చిత్రంతోపాటు పలు చిత్రాల ట్రైలర్లను ఈ గడువు కంటే ముందే విడుదల చేయాలని అభిమానులు ఒత్తిడి తీసుకొస్తున్నారట. జియో ఎఫెక్ట్ అంటే అది అన్నమాట.

English summary
Their is a rumour that Mukesh Ambani's Jio mobile network is indirectly supports Baahubali Trailer record views. Jio's free data offer helped to achieve Baahubali2 trailer's record count.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu