‘సలార్’ కోసం విలన్‌గా స్టార్ హీరో.. ఎక్కడా తగ్గనంటున్న ప్రశాంత్ నీల్?
బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచవ్యాప్తం అయిపోయింది. మరీ ముఖ్యంగా ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్ లోనే ఉంటున్నాయి. ఇక ఇప్పటికే ప్రకటించిన ఒక సినిమా కోసం బాలీవుడ్ నుంచి హీరోను విలన్ గా దింపుతున్నారని తెలుస్తోంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే

జూలై నెలలో రిలీజ్
భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్లు సాధించింది కానీ హిట్ టాక్ రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ సినిమా జూలై నెలలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

మొత్తం నాలుగు సినిమాలు లైన్ లో
రాధేశ్యామ్ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ మరో మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. ముందుగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ అనౌన్స్ చేశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితం కాబోతోంది. ఈ సినిమాని అనౌన్స్ చేశాక ఆయన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో మరో సినిమాని అనౌన్స్ చేశాడు.

ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు
ఆ సంగతి పక్కన పెడితే ఇక కేజిఎఫ్ సినిమాతో కన్నడ సినిమా ఖ్యాతిని భారత వ్యాప్తంగా చాటిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది.

ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ హీరో
తాజాగా సలార్ సినిమాలో ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనది చిన్న పాత్రే అయినప్పటికీ, విలన్స్ ను లీడ్ చేసే మెయిన్ విలన్ ఆయనేనని ప్రచారం మొదలైంది. అయితే ఇది ప్రచారమే కాగా దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రావలసి ఉంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా కొంత మేర జరిగింది. కానీ ఈ కరోనా కారణంగా ఆగిపోయింది.
Recommended Video

మధు గురుస్వామి కూడా
ఇక నిజానికి ఈ సినిమాలో ప్రభాస్‌ని ఢీ కొట్టేందుకు కన్నడ స్టార్ మధు గురుస్వామిని ఫైనల్ చేశారని గతంలో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే తాను 'సలార్'లో భాగమవుతున్నట్లు మధు గురుస్వామి స్వయంగా ప్రకటించడంతో దాదాపు ఆయనే విలన్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. కన్నడ సినీ పరిశ్రమలో మధు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి గుర్తింపు పొందారు. ''వజ్రకాయ, బజరంగీ'' సినిమాలతో ఆయనకు పాపులారిటీ వచ్చింది. మరి ఈ సినిమా లో విలన్ ఎవరు ? అనేది యూనిట్ క్లారిటీ వస్తే కానీ చెప్పలేం.


Click it and Unblock the Notifications











