For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘అల.. వైకుంఠపురములో’కు RR సాయం: అల్లు అర్జున్ కోసం వస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్

  By Manoj Kumar P
  |

  గతంలో పోలిస్తే ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోల మధ్య స్నేహ సంబంధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకరి సినిమా ఫంక్షన్లు మరొకరు హాజరు కావడం, మూవీ ప్రమోషన్‌కు సాయం చేయడం వంటివి ఈ మధ్య ఎక్కువగా కనిపించడమే కారణం. అంతేకాదు, మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో చాలా మంది హీరోలు మల్టీ స్టారర్ మూవీలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దీంతో హీరోల ఫ్యాన్స్ మధ్య కూడా మంచి వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ సాయం చేయబోతున్నారని ఓ వార్త బయటకు వచ్చింది.

  వైకుంఠపురములో వాళ్లంతా కలిశారు

  వైకుంఠపురములో వాళ్లంతా కలిశారు

  ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్‌ల తర్వాత త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కలయికలో వస్తున్న చిత్రమే ‘అల.. వైకుంఠపురములో'. రాధాకృష్ణ, అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. అలాగే ఇందులో నవదీప్, సుశాంత్, టబు, సముద్రఖని, నివేదా పేతురాజ్ తదితరులు నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

  వాళ్లను ఆకట్టుకునేలా రూపొందింది

  వాళ్లను ఆకట్టుకునేలా రూపొందింది

  ఈ సినిమా కూడా త్రివిక్రమ్ గత సినిమాల్లోలా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఇందులో బలమైన కథా, కథనంతో పాటు ఆసక్తికరంగా సాగే స్క్రీన్‌ ప్లే ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా మాటల మాంత్రికుడి పంచ్ డైలాగులు ఇందులో ప్రధానాకర్షణ కానున్నాయనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

  రిలీజ్‌కు ముందే రికార్డు కొట్టేశాడు

  రిలీజ్‌కు ముందే రికార్డు కొట్టేశాడు

  సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అన్ని అప్‌డేట్లకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇందులోని పాటలు, టీజర్, ట్రైలర్‌లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులోని రెండు పాటలు ‘సామజవరగమన', ‘రాములో రాములా' సాంగ్స్ దక్షిణ భారతదేశంలోనే అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించి రికార్డులు క్రియేట్ చేశాయి.

   ఎవరూ రాకున్న సూపర్ సక్సెస్

  ఎవరూ రాకున్న సూపర్ సక్సెస్

  ఇటీవల ‘అల.. వైకుంఠపురములో' మ్యూజికల్ కస్సర్ట్ జరిగింది. దీనికి భారీ స్థాయిలో ఫ్యాన్స్ హాజరు అయ్యారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకకు చిత్ర యూనిట్ మినహా ఎవరూ హాజరు కాలేదు. అయినప్పటికీ ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ముఖ్య అతిథి లేకున్నా ఇంత రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఖుషీగా ఉంది.

  ‘అల.. వైకుంఠపురములో'కు RR సాయం

  ‘అల.. వైకుంఠపురములో'కు RR సాయం

  తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ‘అల.. వైకుంఠపురములో' సినిమా స్పెషల్ షో శనివారం రాత్రి జరగనుందట. దానికి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారనేదే ఆ వార్త సారాంశం. వీళ్లతో పాటు అల్లు అర్జున్, త్రివిక్రమ్, పూజా హెగ్డే, నవదీప్, సుశాంత్ సహా పలువురు యూనిట్ సభ్యులు వస్తున్నారని సమాచారం.

  అప్పుడే వాళ్లిద్దరితో ప్లాన్ చేశారు

  అప్పుడే వాళ్లిద్దరితో ప్లాన్ చేశారు

  ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ కూడా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఇందులో సినిమా గురించి వాళ్లిద్దరూ మాట్లాడతారని అంటున్నారు. సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు ఇలా చేయడం వల్ల ‘అల.. వైకుంఠపురములో'కు భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

  English summary
  Ala Vaikunthapurramuloo is an upcoming Indian Telugu-language action drama film directed by Trivikram Srinivas and produced by Allu Aravind and S. Radha Krishna under their banners Geetha Arts and Haarika & Hassine Creations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X