twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బరి నుంచి ఎన్టీఆర్ ‘బాద్‌షా’ ఔట్... అడ్వాన్స్ రిలీజ్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈచిత్రం సంక్రాంతికి విడుదల చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ తాజాగా అందిన సమాచారం ప్రకారం సంక్రాంతి బరి నుంచి 'బాద్ షా' తప్పుకున్నట్లు తెలుస్తోంది.

    ఇతర సినిమాలతో పోటీ పడటం వల్ల ఇటు తమకు, అటు పోటీ దారులకు నష్టం. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఒక అవగాహనకు వచ్చి 'బాద్ షా'ను సంక్రాంతి బరి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అయితే అభిమానులు ఆందోళన పడాల్సిన పని లేదని సమాచారం. ఎందుకంటే అనుకున్న దానికంటే ముందుగా అంటే... డిసెంబర్ 24న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.

    దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని, ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

    డిసెంబర్ నెల తొలి వారంలోనే ఆడియో విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Sources that Jr Ntr's ‘Baadshah’ is not coming on Sankranthi but actually the release date got advanced. December 24th is the likely date for this Srinu Vytla extravaganza to hit theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X