»   » నిజమా? జూ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతిపై రూమర్

నిజమా? జూ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతిపై రూమర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌పై ఇటు సినిమాతో పాటు, అటు పొలిటికల్ రూమర్లు తరచూ ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పొలిటికల్‌గా అయితే ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. ఇలాంటి వార్తలు మీడియాలో విని విని అభిమానులు కూడా విసిగిపోయారు. అయితే ఈ సారి గాసిప్స్ జూ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి వైపు మళ్లాయి.

ఇటీవల ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది భార్య లక్ష్మిప్రణతిలో కలిసి వచ్చిన ఎన్టీఆర్....ఈ సారి భార్యతో కాకుండా ఒంటరిగా రావడం పలు అనుమానాలకు ఊతమిచ్చినట్లయింది. లక్ష్మి ప్రణతి గర్భవతి కావడం వల్లనే రాలేదనే వార్తలు ఇపుడు ప్రచారంలోకి వచ్చాయి. మరి ఇందులో నిజమెంతో అఫీషియల్‌గా తేలాల్సి ఉంది.

ఇక ఎన్టీఆర్ గురించిన మరో ఆసక్తికర వార్త ఏమిటంటే...త్వరలో సొంతగా సినీ నిర్మాణ సంస్థ స్థాపించాలనే యోచనలో ఉన్నాడట. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, త్వరలో ప్రొడక్షన్ హౌస్‌ను ఎన్టీఆర్ లాంచ్ చేయబోతున్నారని అంటున్నారు. ఇందులో తన సొంత సినిమాలతో పాటు బయటి హీరోల సినిమాలు కూడా నిర్మిస్తారట.

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు దశలో ఉంది. ఈ చిత్రానికి 'రభస', 'జోరు' అనే టైటిల్స్ గతంలో వినిపించాయి. అయితే అఫీషియల్‌గా మాత్రం ఇంత వరకు ఏ టైటిల్ కూడా ఖరారు కాలేదు.

English summary
Film Nagar Rumor is that, NTR is all set to become a father. Sources say that the actor’s wife Lakshmi Pranita is pregnant and is expecting a baby very soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu