»   » జూ.ఎన్టీఆర్ ఆలోచన అదిరింది

జూ.ఎన్టీఆర్ ఆలోచన అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్ తన తాజా చిత్రం రభస ని ప్రమోట్ చేయటానికి కొత్త స్టాటజీతో ముందుకు వస్తున్నాడని సమాచారం. ఈ మధ్యనే విడుదల చేసిన ఫస్ట్ టీజర్...పెద్దగా ఆకట్టుకోకపోవటంతో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకోవటానికి ఓ కొత్త ఫీట్ తో ముందుకు రాబోతున్నట్లు చెప్తున్నారు. రభస చిత్రంలో ఓ పాటకు తనే కొరియోగ్రఫీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పాట మేకింగ్ తో టీజర్ వదిలి, తన ఫ్యాన్స్ ని సంతోష పరిచాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. చిత్రం ప్యాచ్ వర్క్ తో కలిపి 12 రోజులు బ్యాలెన్స్ ఉంది. సినిమా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు.

Jr. NTR choreographing his own steps

ఎన్టీఆర్ బలాలలో ఒకటి డాన్సింగ్ స్కిల్స్ . కెరీర్ మొదటి నుంచి డాన్స్ లతో, విభిన్నమైన స్టెప్ లతో అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అదే అతనితో ఈ ప్రయోగం చేయటానికి ధైర్యం ఇచ్చిందని అంటున్నారు. 'రభస' లో సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌తో 'కందిరీగ' తీసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రం ఆడియోని జూలై 20న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు తాజా సమాచారం.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary

 Jr.NTR is turning into a choreographer by composing his own steps in Rabhasa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu