»   »  జూ.ఎన్టీఆర్: పూరీతో గేమ్ ఆడుతున్నారా?

జూ.ఎన్టీఆర్: పూరీతో గేమ్ ఆడుతున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూ.ఎన్టీఆర్ ఓ విధమైన సందిగ్ధ స్దితిలో ఉన్నాడని తెలుగు ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. తనకు గతంలో ఆంధ్రావాలా వంటి డిజాస్టర్ ఇచ్చిన పూరీతో ముందుకు వెళ్లాలా వద్దా అనే డైలమోలో ఉన్నాడని అంటున్నారు. పూరీ ఇప్పటికి నాలుగు నెలల నుంచీ ఎన్టీఆర్ కి కథ చెప్పించి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. హార్ట్ ఎటాక్ చిత్రం సైతం అనుకున్నంత విజయం సాధించలేకపోవటంతో ఎన్టీఆర్ ఆలోచనలో పడుతున్నాడంటున్నారు.

ఆ విషయం పూరికి చెప్పకుండా గేమ్ ఆడుతున్నాడని చెప్పుకుంటున్నారు. పూరీని ప్రక్కన పెట్టి సుకుమార్ తో ముందుకు వెళ్ధామని ప్లాన్ చేస్తున్నాడంటున్నారు. ఎన్టీఆర్ కోసం ఇప్పటికే సుకుమార్ కథ తయారు చేసి నేరేట్ చేసారని, ఆ కథని బి.వియస్ ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో రిలియన్స్ సమర్పణ తో చేసేందుకు ఉన్నారని తెలుస్తోంది. దాంతో ఇటా..అటా అన్నట్లు ఎన్టీఆర్ ఉన్నాడని అంటున్నారు. అయితే ఇది కేవలం ఎన్టీఆర్ అంటే గిట్టని వాళ్లు పుట్టించిన రూమరే అంటున్నారు.

Jr Ntr game with Puri Jagan

ఇక ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో 'ఆంధ్రావాలా' తరవాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. మధ్యలో బండ్ల గణేష్‌ ఈ కాంబినేషన్‌ కుదర్చడానికి ప్రయత్నించాడు. కానీ... వీలు కాలేదు. ఈ సారి మాత్రం ఎన్టీఆర్‌ - పూరి జత కట్టడం ఖాయంగానే కనిస్తోంది. ఈ చిత్రానికి సంభందించిన కథని ఇప్పటికే పూరీ ఓకే చేయించుకున్నట్లు సమాచారం.

అలాగే టైటిల్ సైతం ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా 'కుమ్మేస్తా' అని పెట్టినట్లు సమాచారం. ఇక పూరీ జగన్నాథ్ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఈ చిత్రం మరో 'ఆంధ్రావాలా' అవుతుందా లేక నిజంగానే కలెక్షన్స్ కుమ్ముతుందా అనేది తేలాలి.

English summary
There is lot of confusion about Ntr’s next project, Puri Jaganadh was trying to convince Ntr since past four months but couldn’t get green signal from him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu