Don't Miss!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- News
ఏపీలో కానిస్టేబుల్ నియామకాల రాత పరీక్షా ఫలితాలు వెల్లడి: రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
NTR30: కొరటాల సినిమాపై ఎన్టీఆర్ యూటర్న్.. ఆచార్య రిజల్ట్ వల్లే ఇలా!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న అతడు.. విశేషమైన అభిమానగణాన్ని కూడా అందుకున్నాడు. మధ్యలో వరుసగా పరాజయాలు ఎదురైనా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే 'టెంపర్' నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు.
హాట్ షోతో షాకిచ్చిన యాంకర్ స్రవంతి: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!
వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్.. కొద్ది రోజుల క్రితమే RRR (రౌద్రం రణం రుధిరం) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు, భారీ కలెక్షన్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను నమోదు చేసుకుంది. ఈ ఉత్సాహంతోనే యంగ్ టైగర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. దీంతో ఈ సినిమాపై అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఎన్నో రకాల ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అదే సమయంలో ఈ సినిమా జూలై నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుందని కూడా డైరెక్టర్ కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుంచి దీనికోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఎవరూ ఊహించని న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
బ్రా కూడా లేకుండా హీరోయిన్ ఫోజులు: ఎద అందాలు పూర్తిగా కనిపించేలా!

తాజా సమాచారం ప్రకారం.. కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఈ మూవీ స్క్రిప్టు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడట. దీనికితోడు ఇందులో 'ఆచార్య' మూవీ తాలూకు కొన్ని సీక్వెన్స్‌లు రిపీట్ అయినట్లు గుర్తించాడట. దీంతో వెంటనే వాటికి మార్పులు కూడా సూచించాడట ఈ స్టార్ హీరో. తారక్ సలహాల మేరకు ఈ స్క్రిప్టుతో కొరటాల కొన్ని మార్పులు చేశాడని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైనల్ ఔట్‌పుట్‌ను ఎన్టీఆర్ కూడా చూశాడని.. దీనిపై అతడు సంతృప్తి వ్యక్తం చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఈ చిత్రం కోసం అతడు త్వరలోనే రంగంలోకి దిగబోతున్నాడని టాక్.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు దేశం మొత్తాన్ని మార్చేలా ఇచ్చే సందేశంతో ఇది రూపొందుతోందట. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ వివరాలు వెల్లడించబోతున్నారు.