»   » జూ ఎన్టీఆర్ చెబితే సినిమా ప్లాప్ అవుతుందా?

జూ ఎన్టీఆర్ చెబితే సినిమా ప్లాప్ అవుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా వాళ్లకు ఉన్నన్ని నమ్మకాలు, సెంటిమెంట్లు దాదాపు మరేరంగంలోనూ ఉండదేమో?.... విజయం వరిస్తుందనే నమ్మకం ఉంటే ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అలాగే ప్లాప్ అవుతుందనే అనుమానం వస్తే అస్సలు అలాంటి చాన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు.

తాజాగా 'ఘాజీ' చిత్రానికి సంబంధించి చోటు చేసుకున్న ఓ విషయం ఇపుడు ఇంస్డ్రీలో హాట్ టాపిక్ అయింది. తెలుగు, తమిళం, హిందీ బాషల్లో తెరకెక్కుతున్న ఈచిత్రానికి తెలుగులో చిరంజీవి, హిందీలో అమితాబ్, తమిళంలో సూర్య వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

అయితే తెలుగులో చిరంజీవిని సంప్రదించడానికంటే ముందు జూ ఎన్టీఆర్ తో వాయిస్ చెప్పిద్దామని అనుకున్నారట. అయితే ఓ సెంటిమెంటు కారణంగా, తన వల్ల సినిమాకు చేటు కాకూడదనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ వెనక్కి తగ్గరట.

 అందుకే ఎన్టీఆర్ రిజక్ట్ చేసాడా?

అందుకే ఎన్టీఆర్ రిజక్ట్ చేసాడా?

ఎన్టీఆర్ గతంలో కొన్ని సినిమాలకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అయితే ఆ సినిమాలేవీ బాక్సాపీసు వద్ద విజయం సాధించలేదు. మళ్లీ ఇదో ప్లాప్ సెంటిమెంటు అయి తనకు చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పడానికి తిరస్కరించారట.

 భవిష్యత్తులోనూ అంతే

భవిష్యత్తులోనూ అంతే

ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం బట్టి చూస్తే ఇకపై ఎప్పుడూ ఇతర సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.

 ఘాజీ

ఘాజీ

తెలుగు హీరో రానా రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఘాజీ'. రానతో పాటు తాప్సీ, కయ్ కయ్ మీనన్, అతుల్ కులకర్ణి, నాజర్ తదితులు ప్రధాన పాత్రలు పోషించారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టెన్మెంట్స్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించారు.

rn

తొలి ఇండియన్ మూవీ

1971లో భారత్ -పాక్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో నీట మునిగిన సబ్ మెరైన్ నేపథ్యంలో ఘాజీ చిత్రాన్ని తెరకెక్కించాడు. స‌బ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న తొలి ఇండియాన్ మూవీ ఘాజీ కావ‌డం విశేషం. ఫిబ్రవరి 17న సినిమా విడుదల కాబోతోంది.

English summary
Jr NTR Rejected voice over for Ghazi. MATINEE ENTERTAINMENT in association with PVP CINEMA is presenting GHAZI, the first of its kind Indian movie based on submarine action. Rana Daggubati, Taapsee Pannu, Kay Kay Menon, Atul Kulkarni are playing the main leads in this underwater war movie releasing on February 17th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu