Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అదిరాయి : ఎన్టీఆర్ ‘టెంపర్’ లీకైన డైలాగులు
హైదరాబాద్ : శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్'. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఈ మధ్యనే విడుదల అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డైలాగులు అంటూ ఇంటర్ నెట్ లో కొన్ని హల్ చల్ చేస్తున్నాయి. వాటిని మీకు అందిస్తున్నాం. అయితే ఈ డైలాగులు నిజంగా సినిమాల్లో ఉన్నవో లేవో కానీ అబిమానులను మాత్రం అలరిస్తున్నాయటంలో సందేహం లేదు.
ఇక చిత్రం విశేషాలు కొస్తే...ఈ చిత్రం విడుదల తేదీని కూడా జనవరి 9 అని ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ మరణంతో కలత చెందిన ఎన్టీఆర్ గ్యాప్ తీసుకున్నారు. ఈ నేఫధ్యంలో చిత్రం విడుదల లేటయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. దాంతో ఈ చిత్రం ఫిబ్రవరి 5 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అఫీషియల్ సమాచారం కాదు కానీ ఇదే తేదీ ఖరారు చేసే అవకాసం ఉందని సమాచారం. డిసెంబర్ 29 నుంచి కంటిన్యూ షెడ్యూల్ జరగనుందని చెప్తున్నారు.
https://www.facebook.com/TeluguFilmibeat
ఆ లీకైన డైలాగులు...స్లైడ్ షోలో...

డైలాగు 1
నేను కంట్లోలు తప్పి కొడితే..కంట్రోలు రూమ్ వరకే పోతావ్...నేను కాన్ఫిడెంట్ గా కొడితే కనపడకుండానే పోతావ్...అదే నేను నాకున్న టెంపర్ తో కొడితే...కోమా...దానమ్మో ఏమంటారా దానికి అడక్కి పోతావ్...గుర్తుందిగా నా పేరు దయా ఇన్సెపెక్టర్ దయా...

డైలాగు 2 :
నువ్వు ఎలిమినేట్ అవటానికి ఎలక్షన్స్ ఎందుకురా...నా చేతిలో ఎనకౌంటర్ అవ్వకుండా చూసుకో...

డైలాగు 3 :
రేయ్ ...నువ్వు పాత సినిమాలో విలన్ డైలాగులు చెప్పకు నేను మళ్లీ పాత సినిమాలో ఎన్టీఆర్ లా మారాల్సి వస్తుంది...నేను మాట్లాడేటప్పుడు కౌంటర్ వస్తే...సెంటర్ లో ఎనకౌంటర్ యే...

డైలాగు4 :
రేయ్ సూరి గా దేవుడు మనిష్యులకి బ్రెయిన్ వెనుక సైడ్, హార్ట్ ముందు సైడ్ ఎందుకు ఇస్తాడో తెలుసా..గుండె పోటు వచ్చినా ఫర్వాలేదు, వెన్ను పోటు పొడవకుండా చూసుకోమని

డైలాగు 5 :
కరెంట్ ని యాంపిల్స్ లో, వోల్టేజ్ ని వోల్ట్స్ లో, డిస్టెన్స్ ని మీటర్లలో కొలుస్తారు అని చిన్నప్పుడే మా బడిలో పాఠాలు చెప్పినవాడు..మరి నా టెంపర్ ఎలా కొలవాలో చెప్పలేదు...

వివరాలు..
ఈ సినిమాకు కథను వక్కతం వంశీ సమకూర్చగా బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

హాట్రిక్ కోసం...
ఎన్టీఆర్, కాజల్ కాంబినేషన్‌లో వచ్చిన బృందావనం, బాద్‌షా, రెండు హిట్‌లు సాధించగా టెంపర్‌తో హాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు.

బండ్ల గణేశ్ మాట్లాడుతూ...
‘‘ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మా సినిమా ‘టెంపర్' 80 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలో కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా ఆడియో వేడుకను నిర్వహిస్తాం. ఎన్టీఆర్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది'' అని అన్నారు.

లుక్ అదిరింది...
చొక్కా లేని ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఇప్పటికే సినిమాపై ఓ అంచనాకి వచ్చేశారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఈ లుక్‌తో అభిమానులకు మరింత దగ్గరవుతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అదే రిపీట్...
పూరి జగన్ తన సినిమాలో హీరోలను విభిన్నంగా చూపించడంలో ముందుంటారు. తాజాగా ఎన్టీఆర్ విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది.

నటీనటులు
కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు.

మిగతా డిటేల్స్...
ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.