For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ కొత్త రిలీజ్ డేట్

  By Srikanya
  |

  హైదరాబాద్ : శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్‌'. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్‌ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఈ మధ్యనే విడుదల అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాగే విడుదల తేదీని కూడా జనవరి 9 అని ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ మరణంతో కలత చెందిన ఎన్టీఆర్ గ్యాప్ తీసుకున్నారు. ఈ నేఫధ్యంలో చిత్రం విడుదల లేటయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. దాంతో ఈ చిత్రం ఫిబ్రవరి 5 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అఫీషియల్ సమాచారం కాదు కానీ ఇదే తేదీ ఖరారు చేసే అవకాసం ఉందని సమాచారం. డిసెంబర్ 29 నుంచి కంటిన్యూ షెడ్యూల్ జరగనుందని చెప్తున్నారు.

  https://www.facebook.com/TeluguFilmibeat

  సోదరుడు జానకీరాం మరణంతో బాధలో ఉన్న ఎన్టీఆర్‌ షూటింగ్‌ను పదిరోజుల పాటు వాయిదా వేసినట్లు నిన్న వార్తలు వచ్చాయి. కానీ షెడ్యూల్‌ ప్రకారమే షూటింగ్‌ జరుగుతుందని చిత్ర యూనిట్‌ దగ్గర నుంచి సమాచారం. చిత్ర బృందం ఎన్టీఆర్‌ను రిక్వెస్ట్‌ చేసి సెట్స్‌ పైకి తీసుకొచ్చినట్లు టాక్‌. ఈ సినిమాకు కథను వక్కతం వంశీ సమకూర్చగా బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, కాజల్‌ కాంబినేషన్‌లో వచ్చిన బృందావనం, బాద్‌షా, రెండు హిట్‌లు సాధించగా టెంపర్‌తో హాట్రిక్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

  jr NTR's Temper new release date

  బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ ‘‘ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మా సినిమా ‘టెంపర్‌' 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. త్వరలో కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా ఆడియో వేడుకను నిర్వహిస్తాం. ఎన్టీఆర్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది'' అని అన్నారు.

  చొక్కా లేని ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఇప్పటికే సినిమాపై ఓ అంచనాకి వచ్చేశారు. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్‌ ఈ లుక్‌తో అభిమానులకు మరింత దగ్గరవుతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పూరి జగన్‌ తన సినిమాలో హీరోలను విభిన్నంగా చూపించడంలో ముందుంటారు. తాజాగా ఎన్టీఆర్‌ విషయంలోనూ అదే రిపీట్‌ అయ్యింది.

  కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

  English summary
  Jr NTR latest film Temper last schedule will start from December 29th onwards. Entire production work will be completed in 22 working days. As per inner sources, makers are looking for February 5th as release date for the mass action entertainer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X