twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'టెంపర్’రేప్, టార్చర్ సీన్స్ కు కలర్ ఛేంజ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్‌'. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్‌ నిర్మాత. ఈ సినిమా ఆడియో, ట్రైలర్స్ ఈ మధ్యనే విడుదల అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. రేపు అంటే ఈ నెల 13న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ గురించి కొన్ని విషయాలు తెలియచేస్తున్నాం.

    ఈ చిత్రంలో కొన్ని విజువల్స్ చాలా డిస్ట్ర్రబ్ గా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ ఫీలవటం జరిగిందని సమాచారం. ముఖ్యంగా కాజల్ మరియు ఐటం గర్ల్ కు చెందిన కొన్ని ఎక్సిపోజింగ్ సన్నివేశాలు బ్లర్ చేసిన తర్వాత...సినిమాలోని రేప్ సీన్ లో వయిలెన్స్ కు భయపడ్డారని తెలుస్తోంది. దాంతో రేప్, టార్చర్ సీన్స్ ని బ్లాక్ అండ్ వైట్ లో చూపమన్నట్లు సమాచారం. ఈ సినిమాలో రేప్ సీన్ చాలా కీలకం.

    ‘టెంపర్' సినిమా రన్ టైం సుమారు 141 నిమిషాలు ఉంటుంది. ఇదే లెంగ్త్ కి ఈ చిత్ర టీం ఫస్ట్ కాపీని రెడీ చేసారని సమాచారం. అందులో ఫస్ట్ హాఫ్ 1 గంట 8 నిమిషాలు, సెకండాఫ్ 1 గంట 13 నిమిషాలు ఉండబోతోంది.

    jr NTR's Temper rape and torture’s color changed

    ఎన్.టి.ఆర్, అతని టీం సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోస్ కి సంబందించిన ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్.టి.ఆర్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కనిపించనున్న ఈ సినిమాలో మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బండ్ల గణేష్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది.

    ఈ సినిమాకు కథను వక్కతం వంశీ సమకూర్చగా బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, కాజల్‌ కాంబినేషన్‌లో వచ్చిన బృందావనం, బాద్‌షా, రెండు హిట్‌లు సాధించగా టెంపర్‌తో హాట్రిక్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

    బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ ‘‘ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మా సినిమా ‘టెంపర్‌'విడుదలకు సిద్గంగా ఉంది. 13న కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా విడుదల చేస్తాం . ఎన్టీఆర్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది'' అని అన్నారు.

    చొక్కా లేని ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఇప్పటికే సినిమాపై ఓ అంచనాకి వచ్చేశారు. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్‌ ఈ లుక్‌తో అభిమానులకు మరింత దగ్గరవుతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పూరి జగన్‌ తన సినిమాలో హీరోలను విభిన్నంగా చూపించడంలో ముందుంటారు. తాజాగా ఎన్టీఆర్‌ విషయంలోనూ అదే రిపీట్‌ అయ్యింది.

    కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

    English summary
    Censor Board got scared with violence and rape scene in the Jr NTR’s “Temper” movie. They have ordered to turn the visual of rape and torture scenes into black and white, wherever they occur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X