Just In
- 1 hr ago
రెచ్చిపోతోన్న బిగ్ బాస్ కంటెస్టెంట్: మొన్న ఏపీ సీఎంపై.. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేపై.. బలిసి మాట్లాడితే!
- 1 hr ago
మా ఆయన దగ్గరున్నదే ఇష్టమన్న అనసూయ: యాంకర్ పర్సనల్ మేటర్ లీక్ చేసి షాకిచ్చిన రోజా
- 2 hrs ago
వేరే వ్యక్తిపై పడుకున్న సమంత: ఐలవ్యూ అంటూ క్యాప్షన్.. వాళ్ల దెబ్బకు పోస్ట్ డిలీట్ చేసేసిందిగా!
- 3 hrs ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
Don't Miss!
- Automobiles
అలనాటి భారత క్లాసిక్ స్కూటర్ కంపెనీ, ఇప్పుడు పూర్తిగా మూతపడనుంది!
- News
ఏపీ పంచాయతీ ఎన్నికల తొలివిడత నోటిఫికేషన్ విడుదల- 11 జిల్లాల్లోనే
- Lifestyle
చీర కట్టుకున్నప్పుడు మేకప్ వేసుకోవడం ఎలా?
- Finance
రిలయన్స్ 'జియో' అదరగొట్టింది: జియో ఆదాయం సూపర్, పెట్రో వ్యాపారం ఓకే
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యాంకర్ ప్రదీప్‌కు జూనియర్ ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్: ఏకంగా స్టార్ హీరోనే అలా చేయడంతో షాకైపోయాడు!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ఫాలోయింగ్ అందుకున్న మేల్ యాంకర్‌గా వెలుగొందుతోన్నాడు ప్రదీప్ మాచిరాజు. లేడీ యాంకర్లు చక్రం తిప్పుతున్నప్పటికీ.. చాలా కాలంగా తన హవాను చూపిస్తున్నాడతను. తద్వారా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్‌ను ఎక్కువగా సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటుతున్నాడు. అలాగే, త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇలాంటి సమయంలో ప్రదీప్‌కు జూనియర్ ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడట. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన కెరీర్.. యాంకర్‌గా మారాడు
రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించాడు ప్రదీప్ మాచిరాజు. వాయిస్‌తోనే ఎంతో మందిని ఆకట్టుకుని అక్కడ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఫలితంగా యాంకర్‌గా అవకాశాలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' అనే షోతో యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించాడు ప్రదీప్. దాని తర్వాత ‘గడసరి అత్త సొగసరి కోడలు' అనే షోతో మొదటి బ్రేక్‌ను అందుకుని గుర్తింపు పొందాడు.

యాంకర్‌గా సక్సెస్‌ఫుల్.. అందుకే ఈ ఘనత
అద్భుతమైన టైమింగ్‌తో పాటు హావభావాలను పలికిస్తూ యాంకరింగ్‌కు సరికొత్త అర్థం చెప్పాడు ప్రదీప్ మాచిరాజు. అంతేకాదు, ఎన్నో షోలను వన్ మ్యాన్ షోగా మలచుకుని సత్తా చాటాడు. ఈ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు యాంకర్‌గా ఎన్నో అవార్డులను అందుకున్నాడు. మరీ ముఖ్యంగా బెస్ట్ యాంకర్‌గా నంది అవార్డును కూడా దక్కించుకున్నాడు.

అన్నింట్లో సూపర్.. సొంతంగా షో మొదలెట్టి
ప్రదీప్ యాంకరింగ్ కెరీర్‌కు ‘గడసరి అత్త సొగసరి కోడలు' తొలి విజయాన్ని అందిస్తే.. ఆ తర్వాత కొన్ని షోలు అతడి పాపులారిటీని అమాంతం పెంచేశాయి. అందులో ఒకటి ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను'. ఈ షోకు రూపకల్పన చేయడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించాడు ఈ టాలెంటెడ్ యాంకర్. ఆ తర్వాత ‘ఢీ' అతడికి భారీ స్థాయిలో క్రేజ్ రావడానికి కారణమైందనే చెప్పాలి.

సినిమాల్లోనూ సత్తా... పెద్ద హీరోలతోనే అలా
ప్రదీప్ ఎన్నో షోలకు యాంకర్‌గా పని చేసి వాటిని సూపర్ సక్సెస్ చేశాడు. అదే సమయంలో కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. వాటిలో ముఖ్యంగా పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది', అల్లు అర్జున్ సక్సెస్‌ఫుల్ సినిమా ‘జులాయి', నాగ చైతన్య హిట్ మూవీ ‘100% లవ్', జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి.

తొలి సినిమాతోనే రికార్డులు క్రియేట్ చేశాడు
యాంకర్‌గా సత్తా చాటిన ప్రదీప్.. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మున్నా అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఇందులో ప్రదీప్ లవ్ గురూగా నటించాడు. ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం' పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే.

యాంకర్ ప్రదీప్‌కు జూనియర్ ఎన్టీఆర్ సర్‌ప్రైజ్
తన తొలి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ప్రదీప్. ఈ నేపథ్యంలో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ట్రైలర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారట. దీన్ని జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేయబోతున్నాడని తెలిసింది. ప్రదీప్ కోసం నిర్మాత అడిగిన వెంటనే ఓకే చెప్పాడట ఈ స్టార్ హీరో. అంత పెద్ద హీరో అడిగిన వెంటనే ఓకే చెప్పడంతో ప్రదీప్ షాకైపోయాడని టాక్.