»   » ఎన్టీఆర్ తగ్గేది అందుకే.. నందమూరి ఫ్యాన్స్ దిమ్మతిరిగే న్యూస్..

ఎన్టీఆర్ తగ్గేది అందుకే.. నందమూరి ఫ్యాన్స్ దిమ్మతిరిగే న్యూస్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన కెరీర్‌లో 27వ చిత్రం కోసం యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. జ‌న‌తాగ్యారేజ్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎన్టీఆర్‌..ఇప్పుడు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై 'జై ల‌వ‌కుశ‌' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో నివేదా థామ‌స్‌, రాశిఖ‌న్నా హీరోయిన్స్‌ నటిస్తున్నారు.

బరువు తగ్గే పనిలో జూనియర్

బరువు తగ్గే పనిలో జూనియర్

ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. మూడు పాత్రలకు పోలిక లేకుండా ఆహార్యంలో వైవిధ్యం చూపేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారట. అందుకోసం ఎన్టీఆర్ బ‌రువు త‌గ్గే ప‌నిలో ఉన్నాడ‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ విదేశాల‌కు వెళ్లినట్టు సమాచారం. దాదాపు ప‌ది నుంచి ప‌దిహేను కిలోల బ‌రువు తగ్గాలని భావిస్తున్నట్టు సమాచారం.

మే 20న జై లవకుశ ఫస్ట్ లుక్

మే 20న జై లవకుశ ఫస్ట్ లుక్

ఎన్టీఆర్ డేట్లను బట్టి నిరంతరంగా షూటింగ్ పూర్తి చేయాలన్న ఆలోచనలో నిర్మాత కల్యాణ్ రామ్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందించేందుకు కృషి చేస్తున్నారు. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.

మరో హాలీవుడ్ నిపుణుడు

మరో హాలీవుడ్ నిపుణుడు

ఇప్పటికే ఈ చిత్రానికి హాలీవుడ్ మేకప్‌మెన్ వాన్స్ హార్ట్‌వెల్ పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు మరో హాలీవుడ్ నిపుణుడు పనిచేస్తున్నాడని ఫిలింనగర్‌లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. విభిన్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయికి తగ్గదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

85 కోట్ల బిజినెస్ ఆఫర్

85 కోట్ల బిజినెస్ ఆఫర్

షూటింగ్ దశలోనే ఉండగానే ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తున్నది. జాతీయ స్థాయిలో పంపిణీ చేయడానికి రూ.85 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే బిజినెస్ విషయంలో ఎలాంటి ఒప్పందాలు ఇంకా జరుగలేదని తెలుస్తున్నది.

English summary
Junior NTR is to shed the wieght for the role of his next movie. Kalyan Ram is the producer. This movie is getting big business offers from all the corners.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu