»   » ఆ తెలుగు హీరోతో జ్వాలా గుత్తా రెండో వివాహం?

ఆ తెలుగు హీరోతో జ్వాలా గుత్తా రెండో వివాహం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా ఈ మధ్య పలు వివాదాలు, పలు ఆసక్తికర వార్తలతో మీడియాలో చర్చనీయాంశం అయింది. తాజాగా జ్వాలా గుత్తాకు సంబంధించిన మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది. గతంలో తన కో ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను పెళ్లాడి విడాకులు తీసుకున్న జ్వాలా....త్వరలో రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

జ్వాలా గత కొంత కాలంగా తెలుగు నటుడు హర్షవర్ధన్ రాణె(తకిట తకిట మూవీ హీరో)తో క్లోజ్‌గా ఉంటోంది. హైదరాబాద్‌లో జరిగే పలు కార్యక్రమాలకు వీరు జంటగా హాజరవుతుండటంతో ఇద్దరు ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తమపై వస్తున్న వార్తలను వీరు ఖండించక పోగా....వాటిని వింటూ ఎంజాయ్ చేస్తుండటంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలకు మరింత బలం చేకూరినట్లు అవుతోంది.

ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న జ్వాలాకు ఎదురైంది. హర్షవర్ధన్‌‌కు, తకు మధ్య ఏముందనేది పూర్తగా పర్సనల్ మ్యాటరని, ఈ విషయం గురించి తాను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని సిగ్గుపడుతూ చెప్పడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.

జ్వాల మాట్లాడుతూ....ప్రస్తుతం బాడ్మింటన్ ఆటపైనే పూర్తి దృష్టి పెట్టానని చెబుతున్న జ్వాల మళ్లీ పెళ్లి చేసుకుని సెటిలవుతానని బెబుతోంది. అయితే ఎవరిని పెళ్లి చేసుకోబుతున్నారు అనే విషయంపై మాత్రం జ్వాల నోరు విప్పడం లేదు. త్వరలోనే జ్వాలా రెండో పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

English summary
“Currently, I am focused and focused only on the game. Did not like having previous plans because I will do when I want and what I feel and good. On a personal level, I am open to find my love again. Somewhere point of time, should be set to marry again, “said Jwala.
Please Wait while comments are loading...