»   » బాలయ్యను రిజెక్టు చేసిన కాజల్...తేజ పై గౌరవంతో?

బాలయ్యను రిజెక్టు చేసిన కాజల్...తేజ పై గౌరవంతో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కు జోడిగా కనిపించిన కాజల్...సినిమా ఫ్లాఫ్ అయినా వరస పెట్టి ఆఫర్స్ అందుకుంటోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆమెను బాలకృష్ణ ప్రెస్టేజియస్ గా భావించి చేస్తున్న వందో చిత్రం కోసం అడిగినట్లు తెలుస్తోంది.

క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం ఆమెను రాణి పాత్రకు అడిగినట్లు తెలుస్తోంది. గౌతమి పుత్ర శాతకర్ణి ...సహ ధర్మ చారిణిగా ఆమె కనిపిస్తే బావుంటుందని భావించారట. అయితే కాజల్ మాత్రం రిజెక్టు చేసిందని మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అందుకు కారణం...తనను లక్ష్మి కళ్యాణం చిత్రంతో పరిచయం చేసిన తేజపై ఉన్న గౌరవంతో అని చెప్పుకుంటున్నారు. తేజ, రానా కాంబినేషన్ లో సురేష్ ప్రొడక్షన్స్ లో ఓ చిత్రం ప్రారంభం కాబోతోందని, అందుకోసం ఆమె డేట్స్ అడిగారని వినపడుతోంది.

Kajal agarwal reject Balyya's 100th Film?

దాంతో ఇప్పుడు మళ్లీ క్రిష్ కు సమస్య మొదటికి వచ్చిందని, బాలయ్య సరసన నయనతార ని అడగాలా అనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. బాలయ్య సైతం కాజల్ అనగానే ఉత్సాహం చూపించారని, ఫెరఫెక్ట్ గా రాణి పాత్రకు సూట్ అవుతుందని భావించారని, ఇప్పుడు మరొకరిని ఫొటో షూట్ చేసి ఓకే చేయాలని వినికిడి. మరి ఎవరిని ఆ అవకాసం వరిస్తుందో చూడాలి.

తేజ చిత్రం విషయానికి వస్తే... కెరీర్ ప్రారంభంల చిత్రం వంటి చిన్న చిత్రాలతో విజయాలు సాధించిన దర్శకుడు తేజ. ఆయనకు గత కొంతకాలంగా హిట్ అనేది లేదు. ఇటీవల ఆయన రూపొందించిన 'హోరా హోరీ' నిరాశపరిచింది. తేజ ఇప్పుడు మరో ప్రయత్నం చేయబోతున్నట్లు సమాచారం.

ఆయన రానా కోసం కథ సిద్ధం చేశారని సమాచారం. రానా కూడా తేజతో పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్‌ని ఎంచుకొన్నారని సమాచారం. 'లక్ష్మీ కల్యాణం'తో కాజల్‌ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది తేజనే.

ఆ తరవాత ఆయన దర్శకత్వంలో కాజల్‌ నటించలేదు. ప్రస్తుతం 'బాహుబలి 2', 'ఘూజీ' చిత్రాలతో బిజీగా ఉన్నాడు రానా. త్వరలోనే తేజ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

English summary
Kajal was approached for a key role of a princess in Balakrishna’s prestigious 100th film Gautamiputra Saatakarni. But Kajal had to miss the film due to lack of enough dates to accommodate the project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu