»   » దానిక్కూడా డబ్బు?... కాజల్ మరీ ఇంత కమర్షియలా?

దానిక్కూడా డబ్బు?... కాజల్ మరీ ఇంత కమర్షియలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ కాజల్ అగ్వరాల్ ఇంతకాలం ట్విట్టర్ జోలికి రాలేదు. ఇంత కాలం కేవలం ఫేస్ బుక్ తో మాత్రమే నెట్టుకొచ్చింది. ఎట్టకేలకు అమ్మడు ట్విట్టర్లో ఖాతా తెరించింది. @MsKajalAggarwal పేరుతో ట్విట్టర్ వరల్డ్ లోకి ఎంటరైంది.

కాజల్ ఇటా ట్విట్టర్ ఖాతా తెరిచిందో లేదు... అలా రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ముందు నుండి కాజల్ చాలా కమర్షియల్ అనే టాక్ ఉంది. ఆమతో సినిమా చేయాలంటే ప్రతిదానికి డబ్బుతో ముడి పెడుతుందని....అందాల ఆరబోత, ముద్దు సీన్లు, పడకగది సీన్లు అగ్రిమెంటు కంటే కాస్త ఎక్కవ అయితే ఎక్స్ ట్రా డబ్బులు వసూలు చేస్తుందనే పేరు ఉంది.

తాజాగా కాజల్ ట్విట్టర్ లోకి రావడానికి కూడా డబ్బులు వసూలు చేసిందని అంటున్నారు. కాజల్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయడంతోనే తొలుత బ్రహ్మోత్సవం సినిమా పోస్టర్ ను ట్వీట్ చేసి.. ఆ సినిమా గురించి చెప్పింది. ట్విట్టర్ లోకి అడుగుపెట్టి బ్రహ్మోత్సవాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు నిర్మాత పివిపి దగ్గర ఎక్స్ ట్రా డబ్బులు లాగిందని అంటున్నారు. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ కాజల్ మరీ ఇంత కమర్షియల్ గా ఉండటాన్ని చూసి పలువురు ఆశ్చర్య పోతున్నారు.

మరో వైపు ట్విట్టర్లో తన ఐడినీ మిస్ కాజల్ అగ్వారల్ పేరుతో క్రియేట్ చేసుకుంది. ఇది చూసిన కొందరు ఎప్పఃటికీ ఇలానే మిస్ గానే ఉంటుందా? పెళ్లి పెట్టాకుల ఆలోచన ఏమీ లేదా? ఎప్పటికీ ఇలానే డబ్బు సంపాదనే లోకంగా బ్రతుకుతుందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

కాజల్ తొలి ట్వీట్ ఇదే..

కాజల్ తొలి ట్వీట్ ఇదే..

కాజల్ ట్విట్టర్లో అడుగు పెట్టడంతోనే ఇలా బ్రహ్మోత్సవం పోస్టర్ పోస్టు చేసింది.

బాలీవుడ్

బాలీవుడ్

తను బాలీవుడ్లో నటిస్తున్న దో లబ్జోంకి కహాని సినిమా గురించి కాజల్ ట్వీట్..

సాంగ్

కాజల్ నటిస్తున్న దో లబ్జోంకి కహాని చిత్రానికి సంబంధించిన సాంగ్ రిలీజైంది. ఈ సాంగుకు మంచి రెస్పాన్స్ వస్తోందంటూ కాజల్ ట్వీట్ చేసింది.

చెల్లి నుండి వెల్ కం

చెల్లి నుండి వెల్ కం

కాజల్ సోదరి నిషా అగర్వాల్... తన సోదరిని ట్విట్టర్లోకి ఆహ్వానిస్తూ ట్వీట్ చేసింది.

English summary
Kajal Aggarwal, who has been an active user of Facebook and Instagram, finally joined the twitter bandwagon, yesterday and you can now follow her at MsKajalAggarwal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu