»   »  కళ్యాణ్ రామ్ నెక్ట్స్ చిత్రం ఖరారు...డిటేల్స్

కళ్యాణ్ రామ్ నెక్ట్స్ చిత్రం ఖరారు...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా షేర్ అంటూ వచ్చిన కళ్యాణ్ రామ్ ..మరో చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ సారి మరో కొత్త దర్శకుడుని లాంచ్ చేస్తూ ఆయన చిత్రం చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...కిక్, మిస్టర్ ఫెరపెక్ట్, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే విభాగంలో రచయితగా పనిచేసిన హరి ని పరిచయం చేస్తూ ఈ చిత్రం రూపొందనుంది.

Kalyan Ram next with a new director

దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ కొత్త చిత్రం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలోనే సినిమాని లాంచ్ చేయనున్నారు. షేర్ కు ముందు అనీల్ రావిపూడి ని దర్సకుడుగా పరిచయం చేస్తూ చేసిన పటాస్ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా చాలా మంది కొత్త దర్శకులను పరిచయం చేస్తూ ఓం, జయాభవ వంటి చిత్రాలు ఆయన చిత్రాలు చేసారు.

English summary
Kalyan Ram to introduce another director. Now he is going to work with Hari, the screenplay writer is making debut as director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu