»   » పవన్ తో చేయించిందే కళ్యాణ్ రామ్ తోనూ..

పవన్ తో చేయించిందే కళ్యాణ్ రామ్ తోనూ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన హిట్ చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జర్నలిస్ట్ గా కనిపిస్తారు. సామాజిక అంశాలపై స్పందించే ఈ పాత్రకు మంచి పేరే వచ్చింది. ఇప్పుడు కొంచెం అటూ ఇటూలో కళ్యాణ్ రామ్ అలాంటి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ..జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పటాస్ లోపోలీస్ గా కనిపించి అలరించిన కళ్యాణ్ రామ్ ...ఈ సినిమాలో జర్నలిస్ట్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారని చెప్తున్నారు.

హే 'రామ్ బాబు' ('...గంగతో రాంబాబు' రివ్యూ)

Kalyan Ram to be seen as journalist!

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ దీనికి నిర్మాత. 'టెంపర్‌' తర్వాత పూరి జగన్నాథ్‌, 'పటాస్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత కళ్యాణ్‌ రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మే నెల నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణను జరుపుకోనుంది.

ఈ చిత్రానికి కథ, కూర్పు, మాటలు, దర్శకత్వం పూరిజగన్నాథే. త్వరలో మిగతా నటీనటులు, టెక్నిషియన్ల వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాధ్..రోగ్ చిత్రం షూటింగ్ లో ఉన్నారు. ఈ చిత్రం పూర్తవగానే కళ్యాణ్ రామ్ తో చిత్రం మొదలుకానుంది.

English summary
Kalyan Ram will be seen as journalist in his next movie directed by Puri Jagannadh.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu