ఆ స్టార్ హీరోతో డేటింగ్? పెళ్లికి శ్రీలీల తల్లి గ్రీన్ సిగ్నల్? కాబోయే అల్లుడితో అలా
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా శ్రీలీల అని చెప్పాల్సిందే. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. సీనియర్లు, జూనియర్లు ఇలా హీరోలంతా శ్రీలీల జపం చేస్తున్నారు. దాంతో ఆమె డిమాండ్ పెరిగిపోతోంది. హీరోయిన్ అన్నాక గాసిప్స్ సహాజం దానికి తగినట్లుగానే శ్రీలీల విషయంలోనూ ఎన్నో రూమర్స్ ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి.
ఆషీకీ 3తో బాలీవుడ్‌లోకి
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆషికీ 3 ద్వారా హీరోయిన్‌గా హిందీ చిత్ర పరిశ్రయకు పరిచయం అవుతున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల రొమాన్స్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 25న ఆషికీ 3 విడుదల కానుంది. అయితే ఈ సినిమా సమయంలో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల క్లోజ్ అయ్యిందట. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

కార్తీక్ ఆర్యన్‌తో పీకల్లోతు ప్రేమలో?
ఎక్కడికి వెళ్లినా కార్తీక్ వెంట శ్రీలీల కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఓ మూవీ సమ్మిట్‌లో కార్తీక్ ఆర్యన్ తల్లితో ఆమె చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యింది. ఇక తనకు కాబోయే కోడలు డాక్టర్ అయితే బాగుంటుందని ఆమె చెప్పడంతో.. పరోక్షంగా శ్రీలీలను కోడలిగా యాక్సెప్ట్ చేసిందా అంటూ బీటౌన్‌లో గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్ - శ్రీలీలలు ఓ రెస్టారెంట్‌కు వెళ్లి వస్తున్న వీడియోలు మీడియాలో వైరల్ అయ్యాయి. ముంబై నగరంలోని బాంద్రాలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ బయటకు వస్తూ ఈ జంట పబ్లిక్‌గా దొరికిపోయింది. దీంతో వీరిద్దరి ప్రేమ బంధం నిజమేనని, కార్తీక్ ప్రేమలో శ్రీలీల మునిగి తేలుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కూతురి ప్రేమకు తల్లి గ్రీన్ సిగ్నల్?
అలాగే కార్తీక్ సోదరి డాక్టర్ కోర్స్ పూర్తి చేసి పట్టా అందుకున్న సందర్భంగా హీరో ఇంట్లో పార్టీ నిర్వహించారు. ఇందులో శ్రీలీల ప్రత్యక్షమై హీరో కుటుంబంతో సరదాగా గడిపింది. తాజాగా కార్తీక్ ఆర్యన్ ఇంట్లో వినాయక చవితి వేడుకల్లో శ్రీలీల పాల్గొన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆశ్చర్యకరంగా ఈసారి శ్రీలీల తల్లి ఈ వేడుకల్లో పాల్గొని.. కార్తీక్ ఫ్యామిలీతో గ్రూప్ ఫోటో దిగారు. దీంతో కార్తీక్ - శ్రీలీల పెళ్లికి ఆమె తల్లి కూడా ఓకే చెప్పేశారని త్వరలోనే వీరి వివాహం జరగనుందని పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది. మరి దీనిపై కార్తీక్ ఆర్యన్, శ్రీలీల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
శ్రీలీల డైరీ ఫుల్
ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ సరసన మాస్ జాతర, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్, తమిళంలో పరాశక్తి చేస్తున్నారు. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. తన ఫోకస్ ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ మీదే పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ముంబైలోనే ఎక్కువసేపు గడుపుతున్నారు. బాలీవుడ్‌లో రష్మిక మందన్న స్థాయిలో పాగా వేయాలని శ్రీలీల ప్లాన్ చేస్తున్నారని, ఇందుకు ఆమె తల్లి పూర్తిగా సహకరిస్తున్నారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











