»   » 'రామ్ చరణ్' ని ప్రక్కన పెట్టి 'రామ్ 'తోనే లాగిస్తున్నారు

'రామ్ చరణ్' ని ప్రక్కన పెట్టి 'రామ్ 'తోనే లాగిస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమ కథల స్పెషలిస్ట్ డైరెక్టర్ కరుణాకరన్ తాజాగా తన పంథా మార్చి యాక్షన్ కథాంశంతో యువ హీరో రామ్ తో ఓ సినమా ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రాన్ని యునైటెడ్ మూవీస్ బేనర్ లో చెయ్యబోతున్నారు. అయితే 'ఎదురే లేదు" అనే టైటిల్ తో తను రెడీ చేసిన స్క్రిప్ట్ 'మగధీర" రామ్ చరణ్ కైతేనే బాగుంటుందని కరుణాకరన్..పట్టుబట్టారు. ఇప్పడు సీన్ మారి రామ్ లైన్ లోకి వచ్చారు. రామ్ చరణ్ డేట్స్ ఇప్పుడిప్పుడే దొరికే పరిస్ధితి కనపడకపోవటంతో ఈ దర్శక, నిర్మాతలిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

'రామ రామ కృష్ణ కృష్ణ" తర్వాత రామ్ ఇంతవరకూ వేరే చిత్రంలో నటించలేదు. అయితే మరో పక్కన రామ్ హీరోగా పేపర్ వరకే ఆగిపోయిన రెండు సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మొదలు కావాల్సిన 'ఊసరవెల్లి" చిత్రానికి బడ్జెట్ దెబ్బ ఎదురైంది, ఇక రెండోది కృష్ణవంశీ సినిమా 'కందిరీగ"మరి చివరికి తనకు ఎప్పుడు కడుతుందో తెలియని పరిస్థితి. ఈ 'ఎదురే లేదు" అన్నా ఎదురులేకుండా ముందుకెళ్ళాలని కోరుకుందాం. 'సింహా"తో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆ రేంజిలోనే ఆడాలని కోరుకుందాం.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu