»   » ఇంకో రీమేక్ ?మంచు లక్ష్మి చేసిన పాత్రలో కత్రినా కైఫ్

ఇంకో రీమేక్ ?మంచు లక్ష్మి చేసిన పాత్రలో కత్రినా కైఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తెలుగులో హిట్టైన చిత్రాలను బాలీవుడ్ లో రైట్స్ కొని రీమేక్ చేయటం సాధారణంగా జరిగేదే. అలాంటిదే ఇప్పుడు మరో తెలుగు సినిమా హిందీ కి వెళ్లబోతోందని సమాచారం. మంచులక్ష్మి నిర్మాతగా, నటిగా తెరకెక్కిన ‘దొంగాట' చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు అంతటా వినిపిస్తోంది. అంతేకాకుండా కత్రినాకైఫ్ కీ రోల్ లో అంటే మంచు లక్ష్మి చేసిన పాత్రలో కనిపిస్తోందని చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మి స్వయంగా నిర్మించిన ఈ సినిమా, మే నెలలో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. కిడ్నాప్ డ్రామాగా నడిచే ఈ చిత్రంలో అడవి శేష్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ద్వారా వంశీ కృష్ణ అనే కొత్త దర్శకుడు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు.

Katrina reprising Manchu Lakshmi role?

అందుతున్న ఇప్పటికే బాలీవుడ్‌ రీమేక్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయని సమాచారం. దర్శకుడు వంశీ కృష్ణయే బాలీవుడ్ రీమేక్‌కూ దర్శకత్వం వహించనున్నారని చెప్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇప్పటివరకూ రాలేదు.

చిత్రం కథేమిటంటే...

వెంకట్ (అడవి శేషు), విజ్జు (మధు), కాటంరాజు (ప్రబాకర్) కలిసి ... స్టార్ హీరోయిన్ శృతి(మంచు లక్ష్మి)ని కిడ్నాప్ చేసి సెటిలైపోవాలనుకుంటారు. కిడ్నాప్ వరకూ విజయవంతంగా చేసి, ఆమె తల్లి (పవిత్ర) నుంచి పది కోట్లు డిమాండ్ చేస్తారు. అంతేకాకుండా...మధు బాస్... అయిన బ్రహ్మీ (బ్రహ్మానందం) ఇంటిలో ఆమెను సేఫ్ గా పెడతారు. బ్రహ్మీ యుఎస్ ఎ లో ఉంటూంటాడు. అనుకోని విధంగా...బ్రహ్మీ... ప్రెవేట్ డిటెక్టివ్ గా ఎంట్రీ ఇచ్చి... ఈ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేయటానికి రంగంలోకి దిగుతాడు. ఎప్పుడైతే తన ఇంట్లోనే శృతి ని దాచారని బ్రహ్మికి తెలుస్తుందో అప్పటినుంచే సమస్యలు మొదలవుతాయి. దాంతో ఆ కిడ్నాప్ డ్రామా వీరు అనుకున్నట్లుగా సాగదు. అనుకోని అవాంతరాలు వస్తాయి. తర్వాత ఏమైంది. అసలు కథలో దాగి ఉన్న ఇంకో ట్విస్ట్ ఏమటి...మిగతా కథ.

English summary
According to the latest ‘Dongaata’ makers are planning to re-make the film in Hindi. Sources say film makers are confident on the film success in Bollywood and are planning to cast Katrina Kaif in important roles.
Please Wait while comments are loading...