»   » 'రగులుతోంది మొగలిపొద...' అంటున్న రామ్ చరణ్

'రగులుతోంది మొగలిపొద...' అంటున్న రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ తేజ్ ఈ సారి 'ఖైది' లోని సూపర్ హిట్ 'రగులుతోంది మొగలిపొద...' సాంగ్ ని రీమిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చరణ్ తాజాగా చేస్తున్న 'ఆరెంజ్' లో ఈ పాటను పెట్టాలని యోచిస్తున్నారు. ఈ మేరకు దర్శకుడు భాస్కర్(బొమ్మరిల్లు ఫేమ్) కూడా ఆమోద ముద్ర వేసి చిరంజీవి అనుమతి కోసం చూస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన 'మగధీర' చిత్రంలో 'బంగారు కోడి పెట్ట..' పాట రీమిక్స్ ఎంత పెద్ద హిట్టు అయిందో తెలిసిన విషయమే. ఆ ఉత్సాహంతోనే ఈ రీమిక్స్ ను చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగేంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu