'ఖుషీ ' పైట్స్ రిపీట్ చేస్తున్న పవన్
దాంతో మళ్లీ 'ఖుషీ ' నాటి మ్యాజిక్ ని రిపీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవన్ తాజాగా త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రంలో 'ఖుషీ ' తరహా ఫైట్స్ ని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. అవి అభిమానులను అలరిస్తాయని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. పవన్ తరహా రొమాంటిక్ యాంగిల్ తో అచ్చ తెలుగు సినిమాలా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు వినికిడి.
ఇక ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశంలో ఉన్నాయి. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోందని సమాచారం. ఇక ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే... అధికారికంగా మాత్రం ఆ టైటిల్‌ని ఖరారు చేయలేదు.
త్వరలో యూరప్ ..పవన్ కళ్యాణ్ హంగామా చేయనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. 20 రోజుల భారీ షెడ్యూల్ నిమిత్తం ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ యూరప్ బయలుదేరింది.
అక్కడ పవన్ కల్యాణ్, హీరోయిన్స్ సమంత, ప్రణీతలపై రెండు పాటలను, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
మొత్తం 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'


Click it and Unblock the Notifications












