Just In
- 59 min ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 3 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిర్మాత అవతారం ఎత్తనున్న స్టార్ డైరెక్టర్..?
సినీ పరిశ్రమలో దర్శకులు నిర్మాతలుగా మారడం, హీరోలు డైరెక్టర్లు కావడం, డైరెక్టర్లు హీరోలు కావడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖుల విషయంలో ఇది జరిగింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కొత్తగా నిర్మాత అవతారమెత్తనున్నాడని తెలుస్తోంది. అది కూడా భారీ బడ్జెట్ సినిమాతోనే ఆయన ఎంట్రీ ఉండనుందని ఫిలింనగర్ టాక్.
దర్శకుడిగా కొరటాల శివకు మంచి రికార్డ్ ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతీ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇటీవలే భరత్ అనే నేను సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న కొరటాల.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఈ సినిమా ఆగస్టు నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూనే.. మరోపక్క నిర్మాతగా కూడా తన లక్ పరీక్షించుకోవాలని భావిస్తున్నాడట కొరటాల శివ. ఈ మేరకు ఓ అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి భారీ సినిమాలో భాగం కావాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారట. పైగా తాను నిర్మించనున్న సినిమాను స్టార్ హీరోతో అన్ని హంగులు జోడించి చిత్రీకరించాలనేది కొరటాల ఆలోచన అని తెలుస్తోంది. కాగా కొరటాల నిర్మించనున్న ప్రాజెక్టులో ఆయన స్నేహితులు కొంతమంది పెట్టుబడులు పెట్టబోతున్నారని సమాచారం.
ఇప్పటికే దర్శకుడిగా సత్తా చాటుతున్న కొరటాల శివ.. నిర్మాతగా కూడా క్లిక్ అయ్యాడంటే తాను డైరెక్ట్ చేసే సినిమాల్లో కూడా నిర్మాతగా వాటా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఫిలింనగర్ వర్గాల్లో కొరటాల నిర్మాత అనే వార్త బాగా హల్చల్ చేస్తున్నప్పటికీ.. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడం గమనించదగిన విషయం.