Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
పవన్ కళ్యాణ్‌ని ఎదుర్కునేందుకు అతనితో డీల్.. క్రిష్ భలే స్కెచ్ వేశాడే!!
అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటు నిర్మాతలు, అటు అభిమానుల కోరిక మేరకు ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పింక్ రీమేక్‌తో పాటుగా క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ క్రిష్ వేస్తున్న ప్లాన్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా అందిన అప్‌డేట్ పవన్ అభిమానుల్లో సరికొత్త ఆత్రుత నింపుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటి? వివరాల్లోకి పోతే..

పవన్ కళ్యాణ్‌తో క్రిష్.. అబ్బురపరిచే స్కెచ్
గతేడాది ఎన్టీఆర్ బయోపిక్స్ చేసి ఆశించిన ఫలితం రాబట్టలేక పోయిన క్రిష్.. ఈ ఏడాది ఆ లోటును పూడ్చేయాలని బలంగా ఫిక్సయ్యారట. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టారట. ఈ నేపథ్యంలో పవన్ తో నటించబోయే నటీనటుల ఎంపికలో క్రిష్ వేస్తున్న స్కెచ్ అబ్బురపరుస్తోంది.

రంగంలోకి బాలీవుడ్ నటుడు
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి తన సత్తా నిరూపించుకోవాలని తపన పడుతున్న క్రిష్.. పవన్‌ను ఎదుర్కోబోయే విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడిని రంగంలోకి దించుతున్నట్లు టాక్. ఈ మేరకు అర్జున్ రాంపాల్‌ను ఎంపిక చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అందుకే క్రిష్ డీల్.. ఇలా ఫిక్స్
ఈ సినిమాను క్రిష్ తెలుగుతో పాటు హిందీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ సినిమాకు బలం చేకూరుస్తుందని క్రిష్ భావిస్తున్నారట. పైగా పవన్ సినిమాలో విలన్ అంటే ఓ రేంజ్ లో ఉండాలి కాబట్టి అర్జున్ రాంపాల్‌నే ఫైనల్ చేయాలని క్రిష్ ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు ఆయనతో డీల్ కూడా సెట్ అయిందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్.. ఇన్‌సైడ్ టాక్
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. పవన్ ఇమేజ్, క్రేజ్‌కి తగ్గట్లుగా మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఓ సందేశాత్మక కథను క్రిష్ సిద్ధం చేశారట. ఈ కథ థియేటర్స్ లో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడిచేలా చేస్తుందని ఇన్‌సైడ్ టాక్.

విరూపాక్ష.. స్పీడ్
ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు క్రిష్. ఇప్పటికే సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు కూడా. పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న క్రిష్.. ఆయన పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగానే స్పీడ్ పెంచేసేలా ప్లాన్ సిద్ధం చేసుకున్నారట.
Recommended Video


కీర్తి సురేష్, అనసూయ రోల్స్
ఇకపోతే ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందని తెలుస్తోంది. అలాగే వెండితెర రంగమ్మత్త అనసూయ కోసం ఓ పవర్‌ఫుల్ రోల్ రెడీ చేశారట క్రిష్. ఈ చిత్రానికి ఏఎం రత్నం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో సినిమా విడుదల చేయాలని ప్లాన్.