»   » బాలయ్య 100వ సినిమా కోసం అన్నీ వదిలేసి దర్శకుడు!

బాలయ్య 100వ సినిమా కోసం అన్నీ వదిలేసి దర్శకుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ కొన్ని రోజులుగా ‘రుద్రాక్ష' పేరుతో హారర్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం జూన్ నెలలో సెట్స్ మీదకు రావాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి బాలయ్య 100వ సినిమా చేసే అవకాశం రావడంతోకృష్ణ వంశీ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ‘రుద్రాక్ష' చేయడం కంటే బాలయ్య 100వ సినిమానే ముఖ్యమని భావిస్తున్న ఆయన....రుద్రాక్ష పనులను వాయిదా వేసుకున్నారు. బాలయ్య సినిమాకు సంబంధించిన పనుల్లో పూర్తిగా నిమగ్నమయినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడనుంది.

Krishna Vamsi for Balakrishna's 100th film

చాలా కాలం నుండి బాలయ్యతో పని చేయాలని కృష్ణ వంశీ ఎదురు చూస్తున్నారు. బాలయ్య కోసం చాలా కాలం క్రితమే స్క్రిప్టు కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. గత నెలలో బాలయ్యను కలిసి కథ వినిపించాడు. బాలయ్యకు కథ నచ్చడంతో వెంటనే దాన్నే 100వ సినిమాగా చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మే నెలలో కృష్ణ వంశీ దర్శకత్వంలో బాలయ్య 100వ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

గతంలో బాలయ్య 100వ సినిమా బోయపాటి దర్శకత్వంలో ఉంటుందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ఆదిత్య 369' సీక్వెల్ గా ‘ఆదిత్య 999' చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. పలు కారణాలతో ఆ రెండు ప్రాజెక్టులను బాలయ్య పక్కన పెట్టేసారు. ఇపుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో చేసే ఆలోచన దిశగా ముందుకు సాగుతున్నారు. మరి ఈ ప్రాజెక్టు అయినా కార్యరూపం దాలుస్తుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి.

English summary
"Krishna Vamsi has been roped in to direct Balakrishna's 100th film. Although he was supposed to finish 'Rudraksha' first, he has apparently postponed it to start work on Balakrishna's film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu