ఆ డైరెక్టర్ ఆఫర్ తిరస్కరించిన ఉప్పెన భామ.. అదే కారణమా?
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఉప్పెన సినిమా మా మొదటి ఆట నుంచి మంచి స్పందన తెచ్చుకుంది.. ఈ సినిమాలో నటించిన నటీనటులకు అలాగే దర్శకుడికి కూడా మంచి పేరు వచ్చింది. దర్శకుడు అయితే ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలతో పని చేస్తాడని ప్రచారం జరుగుతోంది.. వైష్ణవ్ తేజ్ కూడా ఇప్పటికే ఒక సినిమా పూర్తి చేసి మూడో సినిమా కూడా మొదలు పెట్టేశాడు. ఇక ఈ సినిమాలో నటించిన కృతి శెట్టికి సైతం మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
అయితే ఉప్పెన సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ భామ మీద దాదాపు అందరు దర్శకులు ఫోకస్ పడింది. చాలా మంది దర్శకులు ఈ భామకు ఆఫర్లు ఇస్తున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.. అయితే తాజాగా ఆమె ఒక బడా దర్శకుడి ఆఫర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.. ఆ బడా దర్శకుడు మరెవరో కాదు దర్శకుడు తేజ.. ప్రస్తుతం తేజ దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం చేస్తూ చిత్రం సినిమాకి సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించమని కృతి శెట్టిని దర్శకుడు తేజ అప్రోచ్ కాగా తాను నటించలేనని ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

అయితే దగ్గుబాటి అభిరామ్ కోసం తేజ ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. అధికారికంగా ఈ సినిమాను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే నాని, సుధీర్ బాబుల సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరోల పక్కన అవకాశాలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ కొత్త హీరోతో సినిమా చేయడం రిస్క్ అని భావించి ఈ భామ వెనకడుగు వేసింది ఏమో అనే ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











