twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చివరి నిముషంలో వర్మ నిర్ణయం మార్పు

    By Srikanya
    |

    హైదరాబాద్: విష్ణు - వర్మల కలయికలో రూపుదిద్దుకొన్న 'అనుక్షణం' ఈ శనివారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇంటర్వెల్ లేదంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయం మేరకు నిర్ణయం మార్చుకుని ఇంటర్వెల్ ని కలిపినట్లు సమచారం.

    మంచు విష్ణు మాట్లాడుతూ...తీసిన సినిమాలే తీస్తారా? తెలుగు సినిమా మారదా? అనుకొనేవాళ్లకు 'అనుక్షణం' ఓ సమాధానం. ఈ సినిమాలో ఒక్క సీన్‌ కూడా మీరు వూహించరు. సైకో కిల్లర్‌ నేపథ్యంలో సాగే సినిమా ఇది. నేనో పోలీస్‌ అధికారిగా కనిపిస్తా. సైకోని పట్టుకోవాలని నేనెంత తాపత్రయపడతానో, థియేటర్లో ప్రేక్షకులూ అంతే టెన్షన్‌ పడతారు. హాలీవుడ్‌ సినిమాలు ఇష్టపడే యాక్షన్‌ ప్రియులకు తప్పకుండా మా సినిమా నచ్చుతుంది అన్నారు.

    నిర్మాత,హీరో మంచు విష్ణు చెబుతూ ''థ్రిల్లర్‌ తరహా చిత్రాలు ఆంగ్లంలో ఎక్కువగా వస్తుంటాయి. వాటికి ఇంటర్వెల్‌ ఉండదు. మేమూ ఇదే ప్రయత్నం చేస్తున్నాము''అన్నారు అలాగే...‘ఐస్‌క్రీమ్‌'లా ఇది రూ. మూడు లక్షల్లో, ఏడు రోజుల్లో తీసిన సినిమా కాదన్నారు. అంతేకాదు ఈ సినిమాను వేలం ద్వారా అమ్మడమనే కొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్నాం. రాము ఈ ఐడియా చెప్పినప్పుడు టెన్షన్‌పడ్డాను. నాన్నగారికీ, దాసరి అంకుల్‌కూ ఈ పద్ధతి గురించి చెప్పినప్పుడు మంచి ఆలోచన అనీ, సక్సెస్‌ అయితే అందరికీ మార్గదర్శకులవుతారనీ ప్రోత్సహించారు'' అని ఆయన చెప్పారు.

    Last-minute change in Rgv's Anukshanam

    చిత్రం కథ ఏమిటంటే... ‘‘హైదరాబాద్‌ నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టించిన ఓ సీరియల్‌ సెక్స్‌ కిల్లర్‌ కథ ఈ చిత్రం. ఈ కిల్లర్‌ కారణంగా రాత్రి ఏడు గంటల తర్వాత మహిళలు తమ ఇళ్లనుంచి బయటకు రావొద్దని పోలీస్‌ కమీషనర్‌ హెచ్చరించే స్థితి ఏర్పడుతుంది. రెస్టారెంట్లు ఖాళీ అయిపోతాయి. థియేటర్లలో రాత్రి ఆటలు రద్దవుతాయి. నగరం రాత్రివేళ నిర్మానుష్యంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మరింతమంది యువతులను చంపడానికి ప్రయత్నించే హంతకుణ్ణి పోలీసులు పట్టుకోగలిగారా, లేదా? అనేది ఇందులోని ప్రధానాంశం. పూర్తిగా సీరియల్‌ కిల్లర్‌ ప్రధానంగా భారతదేశంలో రూపొందిన మొదటి సినిమా ఇదే'' అని వర్మ తెలిపారు.

    మోహన్‌బాబు మాట్లాడుతూ '' విష్ణును ఐపీయస్‌గా చూడాలనుకొన్నా. నిజ జీవితంలో అది జరగలేదు. తెరపై ఆ పాత్రలో చూపించిన వర్మకి కృతజ్ఞతలు''అన్నారు. మంచు విష్ణు వినోదం బాగా పండిస్తాడు. డాన్సులు బాగా చేస్తాడు. పోరాటల విషయంలో ఇక చెప్పక్కర్లెద్దు. నాన్నలానే డైలాగులూ బాగానే వల్లిస్తాడు.. మొత్తానికి కమర్షియల్‌ సినిమాలకు బాగా సరిపోతాడు. కానీ డాన్సులు, ఫైట్లూ, కామెడీ, భారీ డైలాగులేం లేకుండా - 'అనుక్షణం' చిత్రంలో నటించాడు. అదేంటని అడిగితే.. ''నాకు అలవాటు లేని ప్రయాణం చేయడంలోనూ ఓ ఆనందం ఉంది. నిజానికిది ఓ ఛాలెంజ్‌. రాంగోపాల్‌ వర్మగారు నా వెనుక ఉండబట్టే... ఈ సవాల్‌ను స్వీకరించా'' అని సమాధానమిచ్చారు. తేజస్వి, మధుశాలిని, రేవతి, నవదీప్‌ ఇతర ముఖ్య పాత్రల్లో ఈ చిత్రం రూపొందింది. ఏవీ పిక్చర్స్‌ చిత్రాన్ని నిర్మిస్తోంది.

    English summary
    Vishnu Manchu-starrer Anukshanam, the makers have finally relented to give a break for audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X