జై లవకుశతో లక్ష్మీరాయ్ ఐటెం సాంగ్!
పవన్ కళ్యాణ్ తో ఆడిపాడిన లక్ష్మీరాయ్ ఇక ఓ ప్రత్యేక గీతంలో జూనియర్ ఎన్టీఆర్‌తో నటించనున్నారు.
మెగా హీరోలు పవన్ కల్యాణ్, చిరంజీవితో చిందేసిన లక్ష్మీరాయ్ ఇక నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో సయ్యాటకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాబీ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్‌తో ప్రత్యేక గీతంలో నటించేందుకు లక్ష్మీరాయ్ ఓకే చెప్పినట్టు ఫిలింనగర్ టాక్.

నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించే ఈచిత్రానికి జై లవకుశ అనే పేరును ఖారారు చేసినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జై లవకుశలో ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్ల ఎంపిక కొలిక్కిరాలేదని వినిపిస్తున్నది. పక్కా మాస్ చిత్రంగా రూపొందుకొనే ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
laxmi raai junior ntr jai lava kusha kalyan ram bobby లక్ష్మీరాయ్ జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ కల్యాణ్ రామ్ బాబీ


Click it and Unblock the Notifications