For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎక్సక్లూజివ్: 'బ్రూస్‌లీ' పూర్తి కథ ఇదే

  By Srikanya
  |

  హైదరాబాద్‌: శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన చిత్రం 'బ్రూస్‌లీ'. . డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. థమన్‌ సంగీతం అందించారు. దసరా సందర్భంగా ఈ నెల 16న 'బ్రూస్‌లీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర టీం ఫైనల్ రన్ టైం ని లాక్ చేసింది. ధూమపానం యాడ్స్ తో కలుపుకొని ఈ సినిమా నిడివి 146 నిమిషాలు. ఇందులో సుమారు 5 నిమిషాలు చిరంజీవి కనిపించి ఆడియన్స్ ని థ్రిల్ చేయనున్నాడు. ఈ నేపధ్యంలో చిత్రం కథ అంటూ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది...ఆ కథ ని మీకు ఇక్కడ అందిస్తున్నాం...

  ఇందులో రామ్ చరణ్,కృతి కర్భందా అక్క తమ్ముళ్ళు. రామ్ చరణ్ తండ్రి రావు రమేష్ కు తన పిల్లల్లో ఒకరైనా కలెక్టర్ అవ్వాలని ఉంటుంది. ఇద్దరినీ సంపాదించలేం మిడిల్ క్లాస్ కుటుంబం కాబట్టి మగ పిల్లవాడు అని రామ్ చరణ్ ని చదివిస్తూంటారు. అతనిమీదే ఖర్చు పెడుతూంటారు. అయితే ఇది గమనించిన కృతి కర్భంద బాధపడుతుంది. అక్క బాధ చూడలేని రామ్ చరణ్ ...తన చదువుని త్యాగం చేసి, స్టంట్ మ్యాన్ గా మారి చదివిస్తూంటాడు. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వడు.

  Leak: Story of Ram Charan's Bruce Lee movie

  అయితే రామ్ చరణ్ తండ్రి కు తన కొడుకు అలా స్టంట్ మాన్ అవటం ఇష్టం ఉండదు. ఈ క్రమంలో కృతి కర్భందా ఓ కేసులో అనుకోకుండా విలన్ (సంపత్) చేత పోలీస్ కేసులో ఇరికించబడుతుంది. ఆ కేసు కనుక బయిటకు వస్తే...తను ఐఎ ఎస్ కు సెలక్టు కాదు. దాంతో రామ్ చరణ్ ఆమెను కేసు నుంచి బయిటపడాయలనుకుంటాడు. అయితే ఈ లోగా మరో ట్విస్ట్. కృతికి ఓ సంభంధం సెట్ అవుతుంది. ఆమె పెళ్ళి చేసుకోబోది మరెవరోనో కాదు సంపత్ కొడుకునే. ఈ విషయం తెలిసిన రామ్ చరణ్...ఓ ప్లాన్ వేసి విలన్ కు బుద్ది చెప్పాలనుకుంటాడు. ఆ ప్లాన్ లో బాగంగా సంపత్ కు ఉన్న ఓ బలహీనతను బయిటపెట్టాలనుకుంటాడు. ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటి...సంపత్ అసలు నిజం బయిటపెట్టాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  సెకండాఫ్ పూర్తి కామెడీగా జరుగుతుందని చెప్తున్నారు. జయ ప్రకాష్ రెడ్డి పాత్ర డ్యూయిల్ రోల్ లో సాగుతుంది. స్టంట్ మాస్టర్ గానూ, పోలీస్ అధికారి గానూ ఆయన పాత్ర సాగుతుంది. అదే హైలెట్ అంటున్నారు. అలాగే ..విలన్ ని ఇరికించేందుకు సెకండాఫ్ లో బ్రహ్మానందం చేత హీరో ఆడే గేమ్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని చెప్తున్నారు. క్లైమాక్స్ లో చిరంజీవి ఎంట్రీ వైవిధ్యంగా ఉంటుందని చెప్పుతున్నారు.

  Leak: Story of Ram Charan's Bruce Lee movie

  ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

  గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

  English summary
  Ram Charan's Bruce lee movie story leaked. It's a story of a Stuntman with interesting twists.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X